వసతి ఘటనపై చర్యలు తీసుకోండి..!
– ధైన్య స్థితిలో విద్యార్థులకు వైద్యంపై ఆవేదన
– తాండూరు కోర్టులో బీఆర్ఎస్ నేతల ఫీటీషన్
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం సాయిపూర్ లోని ఎస్టీ హాస్టల్ సంఘటన పై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ లీగల్ సెల్ నాయకులు న్యాయస్థానాన్ని కోరారు. వసతి గృహా వి ద్యార్థులు అస్వస్థతకు గురైన సంఘటనపై లీగల్ సెల్ నాయకులు కె.గోపాల్, నరుకుల నరేందర్ గౌడ్లో ఫీటీషన్ వేశారు. ఈ సందర్భంగా న్యాయమూర్తికి వసతి గృహా బాధలను వివరించారు. నాణ్యతలేని భోజనం వల్ల వసతిగృహానికి చెందిన సుమారు 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని తెలిపారు. అనారోగ్యం పాలైన విద్యార్థినిలను ఎలాంటి సౌకర్యాలు లేని హాస్టల్ లో ఉంచి వైద్య సేవలు అందిస్తున్నారని వివరించారు. అధికారులు నిర్వహకులకు ఎలాంటి చర్యలు తీసుకోకుండా దైన్య స్థితిలోనే విద్యార్థులకు చికిత్సలు చేయిస్తున్నారని తెలిపారు. కావున వసతి గృ హాన్ని సందర్శించి చర్యలు తీసుకోవాలని ఫిటీషన్ ద్వారా కోరారు. అదేవిధంగా విద్యార్థులకు మెరు గైన వైద్యం అందించేలా ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు.
ఇదికూడా చదవండి…

