గ్రూపు-2 పరీక్ష రాసిన పోలీసులు..!

కెరీర్ తాండూరు రాజకీయం వికారాబాద్

గ్రూపు-2 పరీక్ష రాసిన పోలీసులు..!
– అభ్యర్థులతో కలిసి హాజరైన ఇద్దరు ఎస్ఐలు
– తాండూరు పరీక్ష కేంద్రంలో గుర్తింపు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్రూపు-2 పరీక్షను పోలీసులు రాశారు. ఓ వైపు పోలీసు ఉద్యోగం ఉన్నప్పటికి మరేదో సాధించాలని తాపత్రయంతో పరీక్షకు హాజరయ్యారు. ఈ సంఘటన తాండూరు పట్టణంలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. ఆదివారం తాండూరులోని సింధూ డిగ్రీ కాలేజీలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రానికి ఎస్ఐ స్రవంతి పరీక్షా రా సేందుకు హాజరయ్యారు. వికారాబాద్ జిల్లా కోట్పల్లి పోలీస్టేషన్ లో స్రవంతి ఎస్ఐగా పనిచేస్తున్నారు. ఆమెతో పాటు గతంలో ఎ స్ఐగా పనిచేసిన రమేష్ కూడా గ్రూపు-2 పరీక్ష రాసేందుకు వచ్చారు.

రమేష్ గతంలో ధారూర్ పోలీస్టేషన్ తో పాటు తాండూరు నియోజకవర్గం బషీరాబాద్ పోలీస్టేషన్ లో ఎస్ఐగా పనిచేశారు. బషీరాబాద్ పోలీస్టేషన్ లో పనిచేసిన సమయంలో ఆయనపై పలు అభియోగాలు వచ్చాయి. ఈ క్రమంలో ఆయన లాంగ్ లీవ్ తీసుకుని గ్రూపు-2కు సిద్దమైనట్లు తెలిసింది. గ్రూపు-2 పరీక్ష కోసం ఇద్దరు ఎస్ఐలు అభ్యర్థులతో పాటు పరీక్ష రాసేందుకు వచ్చారు. నిర్వహకులు వారిని కూడా తనిఖీ చేసి లోపలికి అనుమతించారు.

ఇదికూడా చదవండి…

గర్భవతికి నో ఎంట్రీ..!