వైన్స్ షాపులో మ‌ద్యం బాటిళ్ల శ్యాంపుల్ సేక‌ర‌ణ

క్రైం తాండూరు వికారాబాద్

వైన్స్ షాపులో మ‌ద్యం బాటిళ్ల శ్యాంపుల్ సేక‌ర‌ణ
– షాపుకు తాళం వేసిన ఎక్సైజ్ పోలీసులు
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: తాండూరు ప‌ట్ట‌ణంలో ఓ ప‌ర్మిట్ రూంలో వ్య‌క్తి మృతి చెందిన సంఘ‌ట‌న ఉద్రిక్తంగా మారింది. వ్య‌క్తి మ‌ర‌ణానికి కార‌ణ‌మైన ప‌ర్మిట్ రూం స‌మీపంలోని వైన్స్ షాపులో తాండూరు ఎక్సైజ్ అధికారులు త‌నిఖీలు చేప‌ట్టారు. ప‌ట్ట‌ణంలోని ధ‌న్‌గ‌ర్ గ‌ల్లికి చెందిన గంజిప‌ల్లి శ్రీ‌నివాస్ అనే వ్య‌క్తి బుధ‌వారం రాత్రి ప‌ర్మిట్ రూంలో మ‌ర‌ణించిన సంఘ‌ట‌న అంద‌రికి తెలిసిందే. గురువారం ఉద‌యం ఈ సంఘ‌ట‌న‌లో మృతుని భార్య పోలీసుల‌కు ఇచ్చిన ఫిర్యాదులో కొత్త మ‌లుపు తీసుకుంది. కల్తీ మ‌ద్యం సేవించ‌డం వ‌ల్లే త‌న భ‌ర్త మృతి చెందాడ‌ని మృతుని భార్య స‌ర‌స్వ‌తి అనుమానం వ్య‌క్తం చేసింది. ఈ మేర‌కు తాండూరు ఎక్సైజ్ పోలీసులు కూడ స్పందించారు. సంఘ‌ట‌న‌కు కేంద్ర‌మైన వైన్స్ షాపులో ఎక్సైజ్ ఎస్ఐలు షాపులోని మ‌ద్యం సీసాల‌ను ప‌రిశీలించారు. ప్ర‌తి బ్రాండ్ నుంచి సీసాల నుంచి ప‌రీక్ష‌ల నిమిత్తం శ్యాంపుల్స్‌ను సేక‌రించారు. అనంర‌తం వైన్స్ షాపుకు తాళం వేసి సీజ్ చేశారు. ఈ ప‌రీక్ష‌ల నిమిత్తం నిజాలు తెలుస్తాయ‌ని అధికారులు పేర్కొంటున్నారు.