టెన్త్ పరీక్షల షెడ్యూల్ విడుదల

కెరీర్ తాండూరు తెలంగాణ మహబూబ్ నగర్ రంగారెడ్డి రాజకీయం వికారాబాద్ హైదరాబాద్

టెన్త్ పరీక్షల షెడ్యూల్ విడుదల
– జాబితాను ప్రకటించిన ఎస్సెస్సీ బోర్డు
హైదరాబాద్‌, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించే పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ విడుదలైంది. ఎస్‌ఎస్‌సీ బోర్డు పరీక్షల నిర్వహణ జాబితాను ప్రకటించింది. వచ్చే ఏడాది మార్చి 21 నుంచి ఏప్రిల్‌ 2వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. అయితే పదో తరగతి పరీక్షలు గతంలో మాదిరిగానే 80% మార్కులకు జరగనున్నాయి. మిగతా 20% మార్కులు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ నుంచి కలపనున్నారు. అయితే ఈ ఏడాది పదో తరగతి పరీక్షా ఫలితాలు మార్కుల రూపంలో వెల్లడించనున్నారు. గతంలో గ్రేడింగ్ రూపంలో ఇస్తున్న ఫలితాలను ఎత్తివేస్తూ మార్కులను ప్రకటించనున్నట్లు ఇటీవల విద్యాశాఖ జీవో జారీ చేసింది. వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి పరీక్షా విధానంలోనూ మార్పులను తీసుకురానున్నట్లు విద్యాశాఖ స్పష్టం చేశారు.

పదో తరగతి పరీక్షల పూర్తి షెడ్యూల్ ఇదే
2025 మార్చి 21న ఫస్ట్ లాంగ్వేజ్ ఎగ్జామ్
2025 మార్చి 22 న సెకెండ్ లాంగ్వేజ్
2025 మార్చి 24 న ఇంగ్లీష్ ఎగ్జామ్
2025 మార్చి 26 న మ్యాథ్స్
2025 మార్చి 28 న ఫిజికల్ సైన్స్
2025 మార్చి 29 న బయోలాజికల్ సైన్స్
2025 ఏప్రిల్ 2 న సోషల్ స్టడీస్

ఇదికూడా చదవండి…

మళ్లీ బహిరంగ వేలం..!