పార్కు స్థలంలో ఇళ్లు కూల్చివేత

తాండూరు రాజకీయం వికారాబాద్

పార్కు స్థలంలో ఇళ్లు కూల్చివేత
– దగ్గరుండి కూల్చివేయించిన అధికారులు
– ఆదుకోవాలని కుటుంబీకుల మొర
తాండూరు, దర్శిని ప్రతినిధి : పార్కు స్థలంలో నిర్మించిన ఇంటిని తాండూరు మున్సిపల్ అధికారులు కూల్చివేయించారు. ఈ సంఘటన శుక్రవారం పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీలో జరిగింది. పట్టణంలోని వార్డు నెంబర్ 7లో మున్సిపల్కు పార్కు స్థలం ఉంది. గత కొన్నేళ్ల క్రితం హసీనా భేగం ఇక్కడ ఇళ్లు నిర్మించుకుని, భర్త, ఇద్దరు కూతుళ్లతో నివసిస్తుంది. అయితే వారు పార్కు స్థలంలో వారు ఇళ్లు నిర్మించుకున్నట్లు గుర్తించారు. తాజాగా మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు పార్కు స్థలంలో నిర్మించిన హసీనా భేగం ఇంటిని కూల్చివేశారు. పార్కుకు ప్రహారి గోడ నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఇళ్లు పార్కు స్థలం లోపలికి రావడంతో కూల్చివేసినట్లు తెలిపారు. అయితే కష్టపడి డబ్బును కూడబెట్టి ఇళ్లును నిర్మించుకున్నామని బాధితురాలు హసీనా భాగం తెలిపింది. తమకు ఇందిరళ్ల ఇళ్లు ఇప్పిస్తామని నాయకులు తెలిపారని, ఇందిరమ్మ ఇళ్ల రాకముందే కూల్చివేయడంతో రోడ్డు పడ్డామని ఆవేదన వ్యక్తం చేసింది. తమకు ఇందిరమ్మ ఇల్లు ఇప్పించి ఆదుకోవాలని మొరపెట్టుకుంది.

ఇదికూడా చదవండి…

వీఆర్వో ఉద్యోగాలకు మార్గదర్శకాలు..!