అంబేద్కర్ పై చిన్నచూపు నీచమైన చర్య

తాండూరు రాజకీయం వికారాబాద్

అంబేద్కర్ పై చిన్నచూపు నీచమైన చర్య
– రాజ్యాంగ నిర్మాతకు అవమానం సహించం
– అందరు ఏకమై బీజేపీ, కాంగ్రెస్కు గుణపాఠం
– కేంద్ర మంత్రి అమిత్ షా క్షమాపణ చెప్పాలి
– జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజుగౌడ్
తాండూరు, దర్శిని ప్రతినిధి : భారత రాజ్యాంగ నిర్మాత డా. బీఆర్. అంబేద్కర్ పై చిన్నచూపు చూపడం నీచమైన చర్య అని బీఆర్ఎస్ పార్టీ నాయకులు, వికారాబాద్ జిల్లా గ్రంథలాయ సంస్థ మాజీ చైర్మన్ రాజుగౌడ్ అన్నారు. బుధవారం రాజుగౌడ్ పార్టీ నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్ సమావేశంలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అంబేద్కర్ ను అవమానించేలా వ్యవహరించిన తీరును ఖండించారు. అంబేద్కర్ ను ఏకవచనంతో మాట్లాడడం నీచమైన చర్య అని అన్నారు.

ఎన్నో ఉన్నత చదువులు చదివి, రాజ్యాంగం రచించిన అంబేద్కర్ ను అవమానించడం బాధాకరమన్నారు. అంబేద్కర్ విలువలను బీజేపీ పార్టీ దిగజార్చడం తగదని అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఒక్కటే అని. అంబేద్కర్ 1949లో ఓబీసీ రిజర్వేషను వ్యతిరేకిస్తే ప్రస్తుతం ఆ పార్టీలు సమ్మతించడమే నిదర్శమన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వలో సీఎం రేవంత్ రెడ్డి అంబేద్కర్‌కు పూల దండకూడా వేయలేదని విమర్శించారు.

అంబేద్కర్ ఓ కులానికే, వర్గానికి సంబంధించిన వ్యక్తి కాదనే విషయాన్ని గుర్తించుకోవాలన్నారు. ఆయన వల్లే అన్ని వర్గాల ప్రజలు స్వేచ్ఛగా జీవిస్తున్నారని అన్నారు. అంబేద్కర్ ను అవమాన పరిచే విధంగా వ్యవహరిస్తే అంబేద్కర్ వాదులంతా ఏకమై బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు గుణపాఠం చెప్పక తప్పదన్నారు. అంబేద్కర్ కు అమిత్ షా భేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. క్షమాపణలు చెప్పే వరకు అమిత్ షా ను, బీజేపీలను వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ నరుకుల నరేందర్ గౌడ్, పట్టణ ప్రధాన కార్యదర్శి అబ్దుల్ సలీం, మైనార్టీ సెల్ పట్టణ అధ్యక్షులు యూనుస్, సోషల్ మీడియా ఇంచార్జ్ ఇంతియాజ్ బాబలు ఉన్నారు.

ఇదికూడా చదవండి…

ఈ చైన్ స్నాచర్ ఖతర్నాక్..!