రూ.12.55 లక్షలకు వ్యర్థాల వేలం..!
– చికెన్, మటన్ వ్యర్థాల సేకరణ వేలంకు స్పందన
– రికార్డు ఆధాయం దక్కించుకున్న తాండూరు మున్సిపల్
– హర్షం వ్యక్తం చేసిన చైర్ పర్సన్, కమీషనర్
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ కార్యాలయంలో చికెన్, మటన్ మాంసాల వ్యర్థాల సేకరణ కోసం నిర్వహించిన బహిరంగ వేలంకు భారీ ఆధాయం వచ్చింది. రూ.12లక్షల 55 వేలకు వేలం ముగిసింది. శనివారం తాండూరు మున్సిపల్ కార్యాలయంలో చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, కమీషనర్ విక్రమ్ సింహా రెడ్డిల సమక్షంలో చికెన్, మటన్ వ్యర్థాల సేకరణ కోసం వేలం పాట నిర్వహించారు. ఈ వేలం పాటలో తాండూరు ప్రాంతానికి చెందిన బిడ్కర్ రఘు, ఎజాజ్, అఫ్ఘల్, హైమద్ అనే వ్యక్తులు పాల్గొన్నారు. ఇందులో అఫ్ఘల్ అనే వ్యక్తి రూ. 12లక్షల 55వేలు వేలం పాడి దక్కించుకున్నారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, కమీషనర్ విక్రమ్ సింహారెడ్డిలు మాట్లాడుతూ వ్యర్థాల సేకరణకు నిర్వహించిన వేలంలో రూ. 12లక్షల 55 వేలు రికార్డు అని హర్షం వ్యక్తం చేశారు. వేలం దక్కించుకున్న వ్యక్తికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఏఆర్ ఫిష్ ప్రోడక్ట్ ద్వారా ఏజేన్సీని అందజేయడం జరుగుతుందని వెల్లడించారు.
అదేవిధంగా వేలంలో పాడిన మొత్తం నగదును మున్సిపల్ కు చెల్లించేందుకు వారం రోజుల గడువు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఒకవేళ డబ్బులు చెల్లించకపోతే వేలం డబ్బులకు సమానంగా తగిన స్థిరాస్తిని మార్డిగేట్ చేసుకోవడం జరుగుతుందని తెలిపారు. సకాలంలో డబ్బులు చెల్లించకుంటే రెండో స్థానంలో అత్యధిక వె లం పాడిన వ్యక్తికి షరతులతో ఏజెన్సీని అందించడం జరగుతుందని వివరించారు. గతంలో కూడా నిర్వహించిన వేలంకు రాష్ట్ర స్థాయిలోనే రూ. 30లక్షల వరకు వేలం దక్కినా.. అప్పట్లో వేలం పాడిన మొదటి, రెండో స్థానం వ్యక్తులు డబ్బులు చెల్లించకపోవడంతో మళ్లీ వేలం వేయడం జరిగిందని చెప్పారు. తాజాగా రూ.12 లక్షల 55వేల ఆధాయం రావడం కూడా మున్సిపల్లో రికార్డు నమోదయ్యిందని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు ప్రభాకర్ గౌడ్, సంగీత ఠాకూర్, వెంకన్న గౌడ్, అధికారులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి..

