ఇసుక మాఫీయాకు కళ్లెం వేయండి
– అక్రమ రవాణాను అడ్డుకోండి
– ఆర్డీఓ కార్యాలయంలో బీజేపీ నేతల ఫిర్యాదు
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరులో పేట్రేగి పోతున్న ఇసుక మాఫీయాకు కళ్లెం వేయాలని తాండూరు బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. శుక్రవారం తాండూరు ఆర్డీఓ కార్యాయలంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు సుదర్శన్ గౌడ్ ఆధ్వర్యంలో జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ మురళీకృష్ణ గౌడ్, నేతలు అధికారులకు ఫిర్యాదు చేశారు. తాండూరు మున్సిపల్ పరిధి పాత తాండూరుతో పాటు కాగ్నా బ్రిడ్జి ప్రాంతాల నుంచి ఇసుక మాఫీయా ఆశ్రమ రవాణాకు పాల్పడుతోందని ఆరోపించారు. భారీ ఎత్తున ఇసుక ట్రాక్టర్లను తరలిస్తున్నారని అన్నారు. అర్ధరాత్రిల్లో పాత తాండూరుతో పాటు మిత్రానగర్, గ్రీన్ సిటీ ప్రాంతాలలో ఇసుక ట్రాక్టర్ల రవాణాతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని అన్నారు. కావున అధికారులు స్పందించి వెంటనే ఇసుక మాఫీయాకు కళ్లెం వేయాలని ఫిర్యాదుతో విజ్ఞప్తి చేశారు. లేదంటే బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ సాహు శ్రీలత, బీజేపీ జిల్లా కార్యదర్శి బంటారం భద్రేశ్వర్, పట్టణ ప్రధాన కార్యదర్శి దోమ కృష్ణ, ఉపాధ్యక్షులు సతీష్, మైనార్జీ మోర్చ అధ్యక్షులు జహిర్ అబ్బాస్, కిసాన్ మోర్చ అధ్యక్షులు ప్రహల్లాదరావు, నాయకులు భాను పవార్, శ్రీనివాస్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

