టీపీసీసీ కోఆర్డినేటర్, ప్రచార కమిటిగా కేపీఆర్
– ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర చైర్మన్ మధుయాస్కీ గౌడ్
– ధన్యవాదాలు తెలిపిన కరణం పురుషోత్తంరావు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(టీపీసీసీ) ప్రచార కమిటి కోఆర్డినేటర్ గా వికారాబాద్ జిల్లా తాండూరుకు చెందిన కరణం పురుషోత్తం రావు(కేపీఆర్) నియామకం అయ్యారు. ఈ మేరకు టీపీసీసీ రాష్ట్ర చైర్మన్, మాజీ ఎంపీ మధుయాస్కీ గౌడ్ నియామక ఉత్తర్వులను జారీ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేయాలని కరణం పురుషోత్తం రావుకు సూచించారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గెలుపుకు పనిచేయాలని సూచించారు. కరణం పురుషోత్తం రావు సుధీర్ఘ రాజకీయ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని ఆయనను ఈ పదవికి ఎంపిక చేయడం జరిగిందని స్పష్టం చేశారు.
అదేవిధంగా కరణం పురుషోత్తం రావు మాట్లాడుతూ తన నమ్మకంతో టీపీసీసీ ప్రచార కమిటి రాష్ట్ర కోఆర్డినేటర్ పదవిని అప్పగించడం పట్ల సీఎం రేవంత్ రెడ్డి, మధు యాస్కీ గౌడ్, చీఫ్ విఫ్ మహేందర్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డితో పాటు పార్టీ పెద్దలకు, నేతలు ధన్యవాదాలు తెలిపారు. పార్టీని అన్ని విధాలుగా బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని అన్నారు.
ఇదికూడా చదవండి…

