పరిశుభ్రదతో ఆరోగ్యవంతమైన సమాజం

తాండూరు రాజకీయం వికారాబాద్

పరిశుభ్రదతో ఆరోగ్యవంతమైన సమాజం
– తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి
– మున్సిపల్లో 100 రోజుల స్వచ్ఛత కార్యక్రమం ప్రారంభం
తాండూరు, దర్శిని ప్రతినిధి : పరిశుభ్రతోనే ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పడుతుందని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. సోమవారం రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు తాండూరు మున్సిపల్ ఆధ్వర్యంలో 100 రోజుల స్వచ్చత ఉద్యమ కార్యక్రమాన్ని చె పెట్టారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. 100 రోజుల కార్యక్రమానికి సంబంధించిన కరపత్రికలను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టణ పరిశుభ్రత అందరి బాధ్యత అన్నారు. పరిశుభ్రతతోనే ఆరోగ్య సమాజం ఏర్పడుతుందన్నారు. ప్రతి ఒక్కరు స్వచ్ఛత పాటించాలని సూచించారు. మున్సిపల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 100 రోజుల కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ధారాసింగ్, మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కోట్రిక విజయలక్ష్మీ వెంకటయ్య, మున్సిపల్ మాజీ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల రత్నమాల నర్సింలు, మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు, మాజీ కౌన్సిలర్లు పట్లోళ్ల నీరజాబాల్ రెడ్డి, ప్రభాకర్ గౌడ్, సోమశేఖర్, ప్రవీణ్ గౌడ్, బోయరవి, జుబేర్ లాల, మున్సిపల్ కమీషనర్ విక్రమ్ సింహారెడ్డి, మేనేజర్ నరేందర్, డీఈ, ఎఈలతో పాటు మెప్మా సిబ్బంది. ఆర్పీలు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

అవగాహన కల్పించిన అధికారులు
మరోవైపు మున్సిపల్ కమీషనర్ విక్రమ్ సింహారెడ్డి ఆధ్వర్యంలో 100 రోజుల కార్యక్రమంపై ర్యాలీ నిర్వహించారు. కార్యాలయం నుంచి ర్యాలీ ఇందిరా చౌరస్తా వద్దకు చేరుకుంది. ఈ సందర్భంగా ఒక మార్పు- అభివృద్ధికి మలుపు అనే నినాదాలు చేశారు. అనంతరం చౌరస్తాలో స్వచ్ఛతపై అందరు భాగస్వాములు కావాలని ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంపై అవగాహన కల్పించారు.

ఇదికూడా చదవండి…

అమృత్ భారత్ పనులు వేగవంతం చేయాలి