పట్టణ పార్కులకు మహర్దశ
– మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్
– 24వ వార్డులో పార్కు పనుల ప్రారంభం
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని పార్కులకు మహర్దశ తీసుకవచ్చేందుకు కృషి చేయడం జరుగుతుందని మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ అన్నారు. తాండూరు పట్టణం 24వ వార్డులో గ్రీన్ బడ్జెట్ కింద మంజూరైన రూ.6లక్షల 50వేలతో పార్కు అభివృద్ధి పనులను చేపట్టారు. సోమవారం మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ వార్డు కౌన్సిలర్ సాహు శ్రీలత లక్ష్మీకాంత్తో కలిసి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ పట్టణ వాసులకు పార్కులే ఆహ్లాదం పంచుతాయన్నారు. అలాంటి పార్కులను సుందరీకరించి మహర్దశ తీసుకవచ్చేందుకు కృషి చేస్తున్నారు.
కౌన్సిలర్ సాహు శ్రీలత మాట్లాడుతూ తన వార్డులో పార్కు పనులు ప్రారంభించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. పార్కుతో పాటు వార్డు సమస్యల పరిష్కారానికి చొరవ చూపుతామన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్, కాంగ్రెస్ జిల్లా మహిళ అధ్యక్షురాలు శొ భారాణి, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

