ఉత్సహాంగా ఎంపీఎల్..!

క్రీడలు తాండూరు రాజకీయం వికారాబాద్

ఉత్సహాంగా ఎంపీఎల్..!
– ఉదయం నుంచి క్రికెట్ పోటీలు
– విజేతలకు బహుమతులు అందించిన డీఎస్పీ
– పాల్గొన్న ఆర్బీఓఎల్ సీఈఓ శ్రీనివాస్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మార్వాడి యువమంచ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎంపీఎల్(మార్వాడి ప్రీమియర్ లీగ్) క్రికెట్ టోర్నమెంట్ ఉత్సహంగా కొనసాగింది. సంక్రాంతి పండగ సందర్భంగా తాండూరు పట్టణం పాత శాలివాహన కాలేజీ గ్రౌండ్ లో క్రికెట్ పోటీలు నిర్వహించారు. మంచ్ కు చెందిన 39 మంది సభ్యులు 3 టీమ్ లుగా ఏర్పడి పోటీలో పాల్గొన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు నాలుగు మ్యాచులతో క్రికెట్ పోటీలు జరిగాయి. ఇందులో నిహార్ -13టీమ్ లీగ్ గెలిచి కప్ సొంతం చేసుకుంది.

ఈ కార్యక్రమానికి తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి, ఆర్బీఓఎల్ సీఈఓ శ్రీనివాస్ రెడ్డిలు హాజరయ్యారు. విజేత జట్టుకు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి చేతుల మీదుగా కప్ తో పాటు బహుమతులను అందజేశారు. రన్నర్ జట్టు సభ్యులకు మెమొంటోలు అందజేశారు. మ్యాన్ ఆఫ్ ది సీరిష్ అభిషేక్ సాల్డా, బ్యాట్స్ మెన్ నిహార్ సోమాని, బెస్ట్ బౌలర్ కిషన్ రాఠి, బెస్ట్ ఫీల్డర్ వినయ్ సార్దా, బెస్ట్ క్యాచ్ అజయ్ సార్థాలను అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మార్వాడి యువమంచ్ చేస్తున్న సామాజిక సేవలను కొనియాడారు. క్రీడలతో అందరి మద్య తత్సంబంధాలు మెరుగుపడతాయన్నారు.

అదేవిధంగా మంచ్ సభ్యులు మాట్లాడుతూ సామాజిక సేవలతో పాటు క్రీడల అభ్యున్నతికి తోడ్పాటు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సమాజం అధ్యక్షులు రమేష్ చంద్ర సార్ధా, నవయువక సంఘం అధ్యక్షులు మన్మోహన్ సార్డా, మహిళ మండల అధ్యక్షురాలు సంతోష్ రాఠి, మంచ్ అధ్యక్షులు అనిల్ సార్డా, కార్యదర్శి సచిన్ రాఠి, కోశాధికారి అరుణ్ సార్డా, దీనేష్ పర్తాని, సంపత్ రాఠి, శ్యామ్ సార్డా, సందీప్ రాఠి, విజయ్ భాస్కర్ రెడ్డి, జగన్నాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి….

మైలాపురం మల్లన్నను దర్శించుకున్న శంకరన్న