రామ జపం చేద్దాం..!
– హిందూ ఉత్సవ సమితి పిలుపు
– అయోధ్య వార్షికోత్సవ నిర్ణయం
తాండూరు, దర్శిని ప్రతినిధి : హిందూ ప్రజలందరు శ్రీరామ నామ జపం చేయాలని తాండూరు హింధూ ఉత్సవ సమితి, హిందూ సంఘాల ప్రతినిధులు పిలుపునిచ్చారు. అయోధ్యలో బాల రామ మందిర ప్రథమ వార్షికోత్సవ సందర్భంగా ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు వెల్లడించారు. ఇందులో భాగంగా తాండూరులోని హనుమాన్ దేవాలయాలతో పాటు ఇతర దేవాలయాలలో బుధవారం ఉదయం 9 గంటలకు 108 సార్లు శ్రీ రామనామ జపం చేయాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా హనుమాన్ చాలీసా, మహా హారతి కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో హిందూ బంధువులందరూ పెద్ద ఎత్తున పాల్గొని ఐక్యతను, దైవ భక్తిని చాటుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఇదికూడా చదవండి…

