తాగిన మైకంలో భార్య హత్య..!
– భర్తకు జీవిత ఖైదు విధించిన జిల్లా న్యాయస్థానం
– రూ. 1వెయ్యి జరిమాన కూడా విధిస్తూ తీర్పు
– వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాగిన మైకంలో భార్యను హత్యచేసిన భర్తకు జీవిత ఖైదుతో పాటు రూ. 1వెయ్యి జరిమాన విధిస్తూ వికారాబాద్ జిల్లా న్యాయస్థానం తీర్పు వెలువరించినట్లు జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. తాండూరు పట్టణ పోలీస్టేషన్లో నమోదైన కేసులో జిల్లా న్యాయమూర్తి డా. సున్నం శ్రీనివాస్ రెడ్డి తీర్పు ఇచ్చినట్లు వెల్లడించారు. ప్రకటనలోని వివరాలిలా ఉన్నాయి. తాండూరు పట్టణం సీతారాంపేట్‌కు చెందిన మ్యాతరి శాంతుకుమార్ భార్య అనసూయను తాగిన మైకంలో కొట్టి చంపేశాడు. 2023లో ఈ సంఘటన జరగగా తాండూరు పట్టణ పోలీస్టేషన్లో అప్పటి సీఐ రాజేందర్ రెడ్డి నిందితుడిపై కేసు నమోదు చేశారు.
ప్రస్తుత సీఐ సంతోష్ కుమార్ కేసుకు సంబంధించిన చార్జ్ సీట్‌ను కోర్టులో దాఖలు చేయగా వికారాబాద్ జిల్లా ప్రిన్సిపల్ డ్రిస్ట్రిక్, సెషన్స్ జడ్జీ డాక్టర్ సున్నం శ్రీనివాస్ రెడ్డి కేసు పూర్వపరాలను పరిశీలించి నిందితుడు మ్యాతరి శాంతుకుమార్కు జీవిత ఖైదు శిక్షతో పాటు రూ. 1000 జరిమాన విధిస్తూ తీర్పు వెలువరించినట్లు జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి వెల్లడించారు. నిందితుడు ఒకవేళ జరిమాన రూ. 1000 చెల్లించకుంటే 6 నెలల సాధారణ జైలు శిక్ష విధించడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా ఈ కేసులో నిందితునికి శిక్ష పడే విదంగా పని చేసిన పీపీ పి.సుధాకర్ రెడ్డి, మొదటి ఐఓలు కె.రాజేందర్ రెడ్డి, ప్రస్తుత ఐఓ సంతోష్ కుమార్, ప్రస్తుత డీఎస్పీ బాలకృష్ణ రెడ్డి, సీడీఓ సలీం పాషా, బ్రీఫింగ్ ఆఫీసర్లు బి.వీరన్న లకు జిల్లా ఎస్పీ అభినందించారు.
ఇదికూడా చదవండి…

