కోటేశ్వర దేవాయలానికి రూ. 10లక్షలు

తాండూరు రాజకీయం వికారాబాద్

కోటేశ్వర దేవాయలానికి రూ. 10లక్షలు
– మంజూరు చేసిన చీఫ్ విప్ మహేందర్ రెడ్డి
– కళ్యాణోత్సంకు ఆహ్వానించిన శివస్వాములు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ పరిధి పాత తాండూరులోని కోటేశ్వర దేవాలయానికి తెలంగాణ రాష్ట్ర చీఫ్ విఫ్ మహేందర్ రెడ్డి చేయూత అందించారు. తనవంతు సాయంగా దేవాలయానికి రూ. 10లక్షలు మంజూరు చేశారు. ఆదివారం పాత తాండూరుకు చెందిన గాండ్ల శివరాజ్, గురు స్వాములు నర్సింలు, భీము, రవికుమార్ తదితరులు హైదరాబాద్ లో చీఫ్ విప్ మహేందర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా దేవాలయం అభివృద్ధికి సహకరించాలని కోరారు.

ఇందుకు చీఫ్ మహేందర్ రెడ్డి స్పందించి తన కోటాలో నుంచి రూ. 10లక్షలు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ఈ నిధులతో వెంటనే దేవాలయ ప్రహారి గోడ పనులు ప్రారంభిచుకోవచ్చని తెలిపారు. గతంలోను తాను మంత్రిగా ఉన్న సమయంలో దేవాలయ అభివృద్ధికి తోడ్పాటు అందించిన విషయాన్ని గుర్తుచేశారు. అదేవిధంగా అడిగిన వెంటనే దేవాయల అభివృద్ధికి నిధులు మంజూరు చేయడం పట్ల మహేందర్ రెడ్డికి వారు కృతజ్ఞతలు తెలిపారు.

అంతేకాకుండా ఈనెల 13న దేవాలయంలో నిర్వహిస్తున్న శివపార్వతుల కళ్యాణోత్సం, 26న జరిగే లక్షద్వీప అర్చన కార్యక్రమాలకు హాజరు కావాలని మహేందర్ రెడ్డిని ప్రత్యేక ఆహ్వానం అందించారు. ఈ కార్యక్రమంలో శివస్వాములు మళ్లపాటి రవికుమార్, మంతటి వీరణ్ణ, గిరిజాపురం సాయికుమార్, జట్టప్ప గారి రాజు, అనిల్ కుమార్, శ్రీనివాస్, నర్సింలు, మామిడి సాయికుమార్ తదితరులు ఉన్నారు.

ఇదికూడా చదవండి…

డా.జయప్రసాద్‌కు మళ్లీ ఉత్తమ అవార్డు..!