ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యానికి బాలుడు మృతి
– నడుచుకుంటు వెళుతున్న బాలుడికి ఢీ
– బస్సుతో పాటు డ్రైవర్‌ను పోలీసులకు అప్పగింత
– బాలుడు కుటుంబంలో విషాధం నింపిన ఘటన
బషీరాబాద్, దర్శిని ప్రతినిధి : ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యానికి ఏడేళ్ల బాలుడు బలి అయ్యాడు. రోడ్డు పక్కనుంచి నడుచుకుంటూ వెళుతున్న బాలుడును బస్సు ఢీ కొనడంతో గాయాలపాలైన బాలుడిని ఆసుపత్రికి తరలించగా మృతి చెందాడు. బుధవారం బషీరాబాద్ మండలంలో జరిగిన ఈ సంఘటన కుటుంబంలో విషాధం నింపింది. వైద్యులు తెలపడంతో తల్లిదండ్రులు బోరున విలపించారు. బషీరాబాద్ ఎస్ఐ శంకర్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. బషీరాబాద్ మండలంలోని టాకీ తాండాకు చెందిన రాథోడ్ వెంకటేష్ కుమారుడు రాథోడ్ శ్రీరామ్(7) చదువుకుంటున్నాడు.
బుధవారం సాయంత్రం తాండాలోని రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళుతుండగా తాండూరు నుంచి క్యాద్గీర వైపు వెళుతున్న ఆర్టీసీ బస్సు(టీఎస్ 34 టీఏ 6545) డ్రైవర్ నిర్లక్ష్యంగా.. అజాగ్రత్తగా నడిపిస్తూ బాలుడును ఢీకొట్టాడు. ఈ క్రమంలో బస్సు కింద పడిన శ్రీరామ్ తలకు, ఛాతి భాగంలో గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు బస్సును అడ్డగించి గాయాలపాలైన శ్రీరామ్ ను 108 సాయంతో తాండూరులోని మాతా శిశు ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించాలని సూచించారు. కొద్ది సేపటికే బాలుడు శ్రీరామ్ మృతి చెందాడు.
దీంతో బాలుడు తల్లిదండ్రులు బోరు విలపించారు. ఈ సంఘటన స్థానికులను కంటతడి పెట్టించింది. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం తాండూరులోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి మార్చురికి తరలించారు. మరోవైపు ప్రమాదానికి కారణమైన బస్సును స్థానికులు బషీరాబాద్ పోలీస్టేషన్‌కు తరలించారు. అజాగ్రత్తగా నడిపించిన డ్రైవర్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ శంకర్ తెలిపారు.
ఇదికూడా చదవండి…

