శంకర్ ‘అన్న’ దానంకు అశేష ఆదరణ..!

తాండూరు లైఫ్-స్టైల్ వికారాబాద్

శంకర్ ‘అన్న’ దానంకు అశేష ఆదరణ..!
– నాలుగులు రోజులుగా నిరంతర వితరణ
– అభినందించిన శ్రీశైల దేవస్థాన కమిటి
– ప్రారంభం నుంచి సహకరించిన మిత్రబృందం
– ధన్యవాదాలు తెలిపిన బావనోళ్ల శంకర్ యాదవ్
తాండూరు, దర్శిని ప్రతినిధి : శ్రీశైల బ్రహ్మోత్సవాలలో తాండూరుకు చెందిన రియల్ ఏస్టేట్ వ్యాపారి, సాయి పుత్ర హోమ్స్ అండ్ డెవలపర్స్ అధినేత బావనోళ్ల శంకర్ యాదవ్ నిర్వహిస్తున్న అన్నదాన మహోత్సవానికి విశేష ఆదరణ లభించింది. ప్రతి యేడాది మాదిరిగానే శంకర్ యాదవ్ ఈసారి ఎనిమిదవ యేడాది అన్నదానం నిర్వహిస్తున్నారు. ఈనెల 19వ తేది నుంచి శనివారం వరకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ప్రతి రోజూ 8వేల నుంచి 10 వేల మందికి నిరంతరం అన్నదానం చేశారు. శంకర్ యాదవ్ చేస్తున్న అన్నదాన సేవను శ్రీశైలం దేవస్థాన కమిటీ సభ్యులు అభినందించారు.

మరోవైపు శంకర్ యాదవ్ చేస్తున్న అన్నదాన కార్యక్రమానికి మిత్ర బృందం బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్, పట్లోళ్ల వేణుగోపాల్ రెడ్డి, మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు, జొన్నల వినోద్ కుమార్, బంటు మల్లప్ప, ప్రభాకర్ గౌడ్, మనోహర్ యాదవ్, మార్కెట్ కమిటి డైరెక్టర్ ఉదయ్ భాస్కర్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, హరీశ్వర్ రెడ్డి, ప్రవీణ్ గౌడ్, గౌడి రాము యాదవ్, మదనసింహారెడ్డి, బి. కిరణ్, చెంగోల్ గ్రామ యువకులు, తాండూరు ప్రాంతం నాయకులు సహకారం అందిస్తున్నారు.

శనివారంతో శంకర్ యాదవ్ చేపట్టిన అన్నదాన కార్యక్రమం దిగ్విజయంగా పూర్తయ్యింది. శనివారం శంకర్ యాదవ్ తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి, పలువురు నాయకులతో కలిసి శివస్వాములకు అన్నదానం చేశారు. ఈసందర్భంగా శంకర్ యాదవ్ మాట్లాడుతూ శ్రీశైలంలో శివభక్తులకు అన్నదానం చేయడం ఎంతో భాగ్యంగా బావిస్తున్నట్లు తెలిపారు. శివుని కృపతోనే భక్తులకు సేవ చేసే యోగం దక్కిందన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలను దైవానుగ్రహంతో కొనసాగిస్తానని అన్నారు.

ఇదికూడా చదవండి…

ధనియాల్లో.. ఔషధ గుణాలు..!