సేవకు వేదిక.. లయన్స్ క్లబ్..!
– తాండూరులో 50 ఏండ్ల సేవలు అభినందనీయం
– లయన్స్ క్లబ్ గోల్డెన్ జూబ్లీ వేడుకలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
– ప్రజా సేవలో ముందుకు సాగుతాం: క్లబ్ సభ్యులు
– అట్టహాసంగా లయన్స్ క్లబ్ గోల్డెన్ జూబ్లీ వేడుకలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : నిరు పేదలు, ప్రజా సేవలకు లయన్స్ క్లబ్ సరైన వేదికగా నిలుస్తుందని తాండూరు ఎమ్మెల్యే బుయ్యి మనోహర్ రెడ్డి అన్నారు. ఆదివారం తాండూరు లయన్స్ క్లబ్ 50 ఏండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా క్లబ్ అధ్యక్షులు డా. రొంపల్లి సంతోష్ కుమార్ గుప్త ఆధ్వర్యంలో పట్టణంలోని శ్రీ కన్వెన్షన్ హాల్లో గోల్డెన్ జూబ్లీ వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి క్లబ్ డిస్ట్రిక్ గవర్నర్ డీ. కోటేశ్వర్ రావుతో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

క్లబ్ అధ్యక్షులు రొంపల్లి సంతోష్ కుమార్ సమక్షంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చేతుల మీదుగా వికలాంగులకు ట్రై సైకిళ్లు, పట్టణంలోని బస్తీ దవాఖానలకు టేబుళ్లు, బీపీ మిషన్లు, వీల్ చైర్లు, కుర్చీలు పంపీణీ చేశారు. దీంతో పాటు తాండూరులో లయన్స్ క్లబ్ ప్రారంభం నుంచి 50 ఏళ్ల పాటు సేవలను అందించిన చార్టెట్ ప్రెసిడెంట్ తాటికొండా ప్రభాకర్ గుప్త(మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ మామ)తో క్లబ్ గోల్డెన్ జూబ్లీ కేక్ ను కట్ చేయించారు. అనంతరం ఆయనను ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ సామాజిక సేవా కార్యక్రమాలకు లయన్స్ క్లబ్ సరైన వేదికగా నిలుస్తుందని అన్నారు. తాండూరులో 50ఏండ్లుగా పేదలతో పాటు అనేక రంగాల వారికి సేవ కార్యక్రమాలతో అండగా నిలువడం అభినందనీయమన్నారు. లయన్స్ క్లబ్ సేవలకు తమవంతు సహకారం అందిస్తామన్నారు. అదేవిధంగా డిస్ట్రిక్ గవర్నర్ కోటేశ్వర్ రావు మాట్లాడుతూ తాండూరులో లయన్స్ క్లబ్ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. తాండూరులో సొంత భవనం ఏర్పాటు చేసి డయాలసిస్ రోగులకు, కంటి చూపు బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించేలా కృషి చేస్తామన్నారు.

అదేవిధంగా తాండూరు క్లబ్ అధ్యక్షులు రొంపల్లి సంతోష్ కుమార్ మాట్లాడుతూ సామాజిక సేవలోనే సంతృప్తి దొరుకుతుందని అన్నారు. అదే స్ఫూర్తితో తాండూరులో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. సేవ చేయాలనే తపనతోనే లయన్స్ క్లబ్లో కోశాధికారిగా, కార్యదర్శిగా పనిచేయడం జరిగిందన్నారు. లయన్ క్లబ్ 50 ఏండ్ల వేడుకలలో తాను అధ్యక్షులుగా ఉండడం గర్వకారణంగా భావిస్తున్నట్లు తెలిపారు. ప్రజా సేవలో మరింత ముందుకు సాగుతూ వన్నె తెచ్చేవిధంగా పనిచేస్తామన్నారు.
అనంతరం పలువురు సభ్యులు రోంపల్లి సంతోష్ కుమార్ ను కూడా ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్ పర్సన్లు స్వప్న పరిమళ్, కోట్రిక విజయలక్ష్మీ వెంకటయ్య, మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు, మాజీ కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్, మాజీ ఎంపీటీసీ రాజ్ కుమార్, వాసవీ మహిళ సంఘం అధ్యక్షురాలు కోట్రిక నాగలక్ష్మీ, లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ ఫస్ట్ వైస్ గవర్నర్ మ హేందర్ కుమార్, సెకండ్ వైస్ గవర్నర్ సురేష్ జాజ్ఞాని, రీజీయన్ చైర్మన్ అశోక్ కుమార్, పీడీజీ రమేష్ చంద్ర పండిత్, కమిటి కో చైర్మన్ సల్లా దామోదర్, క్లబ్ సీనీయర్ సభ్యులు ఓం ప్రకాష్ సోమాని, రాజ్ గోపాల్ సర్దా, శరణు, జోన్ చైర్మన్ యెడ్రామి బసన్నప్ప, క్లబ్ కార్యదర్శి వీర ప్రసాద్. కోశాధికారి అసద్ ఆలీ. లయన్స్ క్లబ్ సభ్యులు, మహిళ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

