ఉత్సహాంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం

తాండూరు రాజకీయం వికారాబాద్

ఉత్సహాంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం
– 26 ఏండ్ల తరువాత కలుసుకున్న విద్యార్థులు
– పట్టణంలోని సెయింట్ మార్క్స్ స్కూల్లో వేడుకలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఉత్సహాంగా జరిగింది. ఆదివారం పట్టణంలోని సెయింట్ మార్క్స్ స్కూల్లో పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం జరుపుకున్నారు. 1990-2000కు చెందిన పదో తరగతి విద్యార్థులు 26 ఏండ్ల తరువాత ఒకే చోట కలుసుకున్నారు. ఈ సందర్భంగా అప్పట్లు విద్యా బోధన చేసిన ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. చదువుకునే రోజుల్లో చేసిన అల్లర్లు, ఇతర జ్ఞాపకాలను నెమరు వేసుకుని సంతోషంగా గడిపారు. తమ వద్ద పాఠాలు నేర్చుకున్న విద్యార్థులు ఉద్యోగాలు, వ్యాపారాలలో ఉన్నతంగా స్థిరపడడంతో ఉపాధ్యాయులు సంతోషం వ్యక్తం చేశారు. ఎంత ఉన్నత స్థాయికి ఎదిగినా తోటి వారికి, కన్నవారికి, పాఠశాలకు సహాయ, సహకారాలు అందించడం మరిచిపోవద్దని సూచించారు. అనంతరం పూర్వ విద్యార్థులు ఆట పాటలు, పలు పోటీలతో ఉత్సహంగా గడిపారు.

ఇదికూడా చదవండి…

పదేళ్ల నీరీక్షణకు మోక్షం..!