‘కోత’ల సర్కారుగా కాంగ్రెస్..!

తాండూరు రాజకీయం వికారాబాద్

‘కోత’ల సర్కారుగా కాంగ్రెస్..!
– కొత్త రేషన్ లబ్దిదారుల్లో పేర్లు కట్
– రేషన్ అందించకుండా పరేషాన్
– బీజేపీ మాజీ కౌన్సిలర్ సాహు శ్రీలత లక్ష్మీకాంత్
తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్రజా పాలన పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం కోతల సర్కారుగా మారిందని బీజేపీ తాండూరు మున్సిపల్ మాజీ కౌన్సిలర్, మహిళ మోర్చ రాష్ట్ర కార్యదర్శి సాహు శ్రీలత లక్ష్మీకాంత్ విమర్శించారు. శుక్రవారం ఆమె ఓ ప్రకటనలో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు కొత్తగా మంజూరు చేసిన రేషన్ కార్డుల్లో లబ్దిదారుల పేర్లను గల్లంతు చేసిందని ఆరోపించారు. కొత్త రేషన్ కార్డు కోసం పేదలు ఆశగా దరఖాస్తులు చేసుకుంటే పేర్లను తొలగించి పరేషాన్ చేస్తుందని విమర్శించారు.

తన వార్డులలో 250పైకి పైగా లబ్దిదారులు దరఖాస్తులు చేసుకుంటే 45 మందికి మాత్రమే కోత్త కార్డులను మంజూరు చేసిందని తెలిపారు. ఒక్కో కుటుంబంలో 6 మంది వరకు లబ్దిదారులు ఉంటే కుటుంబంలో ఒకే ఒక్క లబ్దిదారులు ఉన్నట్లుగా కార్డులు మంజూరు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. 45 కార్డులలో 31 కుటుంబాలకు ఒక్కరి పేరుతోనే కార్డులు మంజూరు చేసిందన్నారు. మిగిలిన లబ్దిదారుల పేర్లను కట్ చేసి మంజూరు చె యడం ఎంటని ప్రశ్నించారు.

మిగిలిన లబ్దిదారులకు రేషన్ అందకపోవడం బాధాకరమని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కరెంట్ కోతలతో పాటు రేషన్ కార్డులలో పేర్లలలో కూడా కోతలు విధించి కోతల సర్కారుగా మారిందని విమర్శించారు. ఇప్పటికైనా పేదల రేషన్ లబ్దిదారులకు కార్డులలో పేర్లను నమోదు చేసి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

ఇదికూడా చదవండి…

ఫస్ట్ డే.. నో’టెన్‌’షన్..!