కోట్ పల్లిని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలి

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

కోట్ పల్లిని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలి
– టూరిజం ద్వారా బోటింగ్ ఏర్పాటు చేయండి
– అసెంబ్లీ సమావేశంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లాలోని కోట్ పల్లి ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కోరారు. శనివారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ప్రసంగించారు. శని, ఆదివారాలు కోట్ పల్లి ప్రాజెక్టును సందర్శించేందుకు హైదరాబాద్ మహానగరాలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి సందర్శకులు వస్తుంటారని తెలిపారు. 5వేల నుంచి 10వేల మంది వరకు సందర్శనకు వస్తారని తెలిపారు.

గత ప్రభుత్వ హాయాంలో అరకొర వసతులు కల్పించడంతో ఇబ్బందులు పడేవారని అన్నారు. టూరిజం మంత్రిత్వ శాఖ ద్వారా కోట్ పల్లి ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా అభివృద్ధి పరిచేందుకు చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు.

ఇదికూడా చదవండి…

ఇసుక మాఫీయా.. దౌర్జన్యం..!