పసబిడ్డ ప్రాణానికి సాయం..!

ఆరోగ్యం తాండూరు రాజకీయం వికారాబాద్

పసబిడ్డ ప్రాణానికి సాయం..!
– రూ.1లక్ష విరాళం ఇచ్చి దాతృత్వం చాటుకున్న ప్రైవేట్ స్కూల్ మేనేజ్మెంట్
– అభినందించిన ఆర్బివోఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : బిడ్డ జ‌న్మించి కేవ‌లం ప‌ది నెల‌లే అయింది. త‌ల్లి ఒడిలో ఆడిపాడాల్సిన ఆ బుడ్డోడు ఆస్ప‌త్రి పాల‌య్యాడు. ఆ ప‌సిబిడ్డ కాలేయ వ్యాధితో బాధ‌ప‌డుతున్న‌ట్లు తెలియ‌డంతో త‌ల్లిదండ్రులు త‌ల్ల‌డిల్లిపోతున్నారు. ఆ ప‌సికందును బ‌తికించుకునేందుకు శ‌త‌విధాలా ప్ర‌య‌త్నిస్తున్నారు.. కానీ ఆర్థిక క‌ష్టాలు వెంటాడుతుండ‌టంతో.. దిక్కుతోచ‌ని స్థితిలో ఉండిపోయారు.

దాత‌ల నుంచి ఆర్థిక సాయం కోసం కోసం ఎదురుచూడడంతో ఆర్బివోఎల్ సీఈఓ శ్రీనివాస్ రెడ్డి ముందుగా స్పందించి ఆర్థిక సాయం అందించారు. తనతోపాటు నియోజకవర్గంలోని దాతలు ముందుకొచ్చి సహకారం అందించాలని కోరడంతో… మనసున్న మనుషులు స్పందించి పసిపాప ప్రాణానికి సాయం అందిస్తున్నారు. అందులో భాగంగా శుక్రవారం తాండూర్ ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రూ. 1 లక్ష విరాళాన్ని అందజేశారు.

మానవతా దృక్పథంతో సహాయం అందించిన ప్రైవేట్ స్కూల్ మేనేజ్మెంట్ ప్రతినిధులకు బాదిత వశిష్ట కుటుంబ సభ్యులతో పాటు శ్రీనివాస్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రైవేట్ స్కూల్ మేనేజ్మెంట్ సభ్యులు రవీందర్ రెడ్డి, మోహన్ కృష్ణ గౌడ, మహిపాల్ రెడ్డి, వెంకట్ రెడ్డి, అభిలాష్ రెడ్డి, సతీష్, శివ, కీర్తి శర్మ, వెంకటేష్, గణేష్, రాములు, కవిత, ప్రవీణ్, గోపాల్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

రూ.10.21 లక్షలకు తైబజార్ వేలం