అంబేద్కర్‌పై ఎస్ఐ అభిమానం..!
– విగ్రహావిష్కరణకు ఆర్థిక సాయం
– బషీరాబాద్ ఎస్ఐ శంకర్‌కు అభినందనలు
బషీరాబాద్, దర్శిని ప్రతినిధి : భారత రాజ్యాంగ నిర్మాత డా. బీఆర్ అంబేద్కర్‌పై తాండూరు నియోజకవర్గం బషీరాబాద్ పోలీస్టేషన్ ఎస్ఐ శంకర్ అభిమానం చాటుకున్నారు. ఈనెల 14న జరుగుతున్న అబేంద్కర్ జయంతి సందర్భంగా బషీరాబాద్ మండలం మల్కాన్‌గిరి గ్రామంలో ఆయన విగ్రహావిష్కరణకు ఏర్పాట్లు చేశారు.

సోమవారం బషీరాబాద్ ఎస్ఐ శంకర్ విగ్రహావిష్కరణ కోసం తనవంతు సాయం అందించారు. గ్రామానికి చెందిన అంబేద్కర్ యువజన సంఘం సభ్యులకు రూ. 5వేలను అందజేశారు. అంబేద్కర్ విగ్రహావిష్కరణకు ఆర్థిక చేయూత అందించడం పట్ల మల్కాన్ గిరి గ్రామస్తులు, అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు ఎస్ఐ శంకర్‌కు అభినందనలతో పాటు ధన్యవాదాలు తెలిపారు. బషీరాబాద్ పోలీస్టేషన్లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ శంకర్ శాంతిభద్రతల పరిరక్షణతో పాటు సామాజిక సేవ కార్యక్రమాలతో మండల ప్రజల మన్ననలను పొందతున్నారు. గతంలో ఆర్టీసీ బస్సు ఢీ కోని మృతి చెందిన బాలుడి కుటుంబానికి ఎస్ఐ శంకర్ ఆర్థిక సాయం అందించారు. దీంతో పాటు మండలంలో పౌరహక్కులు, బాల్య వివాహాలు, సీసీ కెమెరాల ఏర్పాట్లు, శాంతిభద్రతల పరిరక్షణపై ప్రజల్లో చైతన్యం తీసుకవచ్చేందుకు కృసి చేస్తున్నారు.
రోడ్డు నిబంధనలు పాటించాలి
బైకులు, ఇతర వాహనాలు నడిపే ప్రతి ఒక్కరు రోడ్డు నిబంధనలు పాటించాలని ఎస్ఐ శంకర్ సూచించారు. నెంబర్ ప్లేట్లు లేని వాహనాలను రోడ్లపైకి తీసుకరావద్దని, నిబంధనలు పాటించకుండా నడుచుకుంటే చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ముఖ్యంగా మైనర్లు వాహనాలను నడపరాదన్నారు. యువత, పెద్దలు మద్యం సేవించి, లేదా సెల్ ఫోన్లలో మాట్లాడుతూ డ్రైవింగ్ చేయరాదన్నారు. రోడ్డు నిబంధనలు పాటిస్తూ ప్రమాదాల నియంత్రణకు సహకరించాలన్నారు.
ఇదికూడా చదవండి….

