తైబజార్‌ను ఎత్తివేయాలి..!

తాండూరు రాజకీయం వికారాబాద్

తైబజార్‌ను ఎత్తివేయాలి..!
– అధిక ఫీజులతో చిరు వ్యాపారులకు నష్టం
– ప్రతి రోజు ఆర్థిక భారంతో ఇబ్బందులు
– బీజేపీ పట్టణ ఉపాధ్యక్షులు అతారం కిరణ్‌ ముదిరాజ్
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్‌లో చిరు వ్యాపారులపై అర్ధిక భారం మోపే తైబజార్‌ను ఎత్తివేయాలని బీజేపీ పట్టణ ఉపాధ్యక్షులు అంతారం కిరణ్‌ ముదిరాజ్ డిమాండ్ చేశారు. మంగళవారం ఓ ప్రకటనలో ఆయన మాట్లాడుతూ మున్సిపల్‌ ఆధాయాన్ని పెంచుకునేందుకు తైబజార్‌ ఫీజుల వసూళ్లను చేపట్టడంపై విమర్శించారు.

చిరు వ్యాపారులపై రూ. 20ల నుంచి 50ల వరకు అధిక ఫీజులను వసూళ్లను నిర్ణయించడం తగదన్నారు. పట్టణంతో పాటు వివిధ ప్రాంతాలకు చెందిన చిరు వ్యాపారులు వచ్చి రోడ్లపై వ్యాపారాలు చేసుకుని జీవనం సాగిస్తున్నారని, వారిపై తైబజార్ ఫీజులను వసూలు చేస్తూ వ్యాపారుల కష్టాన్ని దోచుకున్నట్లుగా మారుతుందని అన్నారు. కూరగాయలు, నిత్యావసర సరకులు, పండ్లు, తదితర వస్తువులు రహదారుల పక్కన అమ్ముకుని వెళ్తుంటారని అన్నారు.

రోజు కష్టపడితే వచ్చిన ఆధాయాన్ని దోచుకెళ్లడమే అని ఆవేధన వ్యక్తం చేశారు. గతంలో చిరు వ్యాపారులను దృష్టిలో ఉంచుకుని తైబజార్‌ను ఎత్తివేస్తే.. మళ్లీ అమల్లోకి తెచ్చి వ్యాపారులను నష్టాలపాలు చేయడం సమంజసం కాదని అన్నారు. చిరు వ్యాపారులపై ఆర్థిక భారంగా మారిన తైబజార్‌ను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. చిరు వ్యాపారులను మినహాయించి పెద్ద వ్యాపారస్తుల వద్ద వసూలు చేసుకోవాలని అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఇదికూడా చదవండి….

జుంటుపల్లి.. రామమయం..!