పండగలా బీఆర్ఎస్ రజతోత్సవం…!

తాండూరు రాజకీయం వికారాబాద్

పండగలా బీఆర్ఎస్ రజతోత్సవం…!
– వాడవాడలా ఎగరిన గులాబీ జెండా
– ఆవిష్కరించిన ప్రజా ప్రతినిధులు, నాయకులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలో బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలను పార్టీ నేతలు పండగలా జరుపుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ 25వ ఏండ్ల ఆవిర్భావం సందర్భంగా మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్, మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిల ఆదేశాల మేరకు పట్టణంలోని ప్రతి వార్డులో గులాబీ జెండాలను ఆవిష్కరించారు.

పార్టీ 25వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురుస్కరించుకుని పట్టణంలోని రోహిత్ రెడ్డి నివాసం వద్ద పార్టీ కార్యాలయంలో పార్టీ పట్టణ అధ్యక్షులు అఫ్పూ(నయూం), జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజుగౌడ్, సీనీయర్ నాయకులు పట్లోళ్ల నర్సింలు, శ్రీనివాస్ చారి, తదితరులు హాజరై గులాబీ జెండా ఆవిష్కరించారు. అదేవిధంగా పట్టణంలోని విలియమూన్ చౌరస్తా వద్ద కూడా గులాబీ జెండా ఆవిష్కరించారు. దీంతో పాటు పట్టణంలోని సాయిపూర్ ప్రాంతంలో పట్లోళ్ల నర్సింలు ఆధ్వర్యంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకున్నారు. పార్టీ నేతలు కార్యకర్తలతో కలిసి గులాబీ జెండా ఆవిష్కరించారు. మరోవైపు పట్టణంలోని ప్రతి వార్డులో పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని బీఆర్ఎస్ జెండాలను ఎగురవేశారు. ఈ కార్యక్రమాల్లో పార్టీ మాజీ ప్రజా ప్రతినిధులు, మాజీ కౌన్సిలర్లు, నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

ఉగ్రదాడి.. దుర్మార్గం..!