సాధారణ విద్యార్థులతో అసాధారణ ఫలితాలు

కెరీర్ తాండూరు రాజకీయం వికారాబాద్

సాధారణ విద్యార్థులతో అసాధారణ ఫలితాలు
– చైతన్య జూనియర్ కళాశాల కరపత్రాల ఆవిష్కరణ
– ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను అభినందించిన కరస్పాండెంట్ పెరుమాళ్ల వెంకట్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూర్ పట్టణంలోని చైతన్య జూనియర్ కళాశాలలో గత 20 ఏళ్లుగా సాధారణమైన విద్యార్థులచే అసాధారణ ఫలితాలను సాధిస్తున్నామని, అందుకు తగ్గ విద్యా బోధన చేస్తున్న అధ్యాపకులను, చక్కగా చదువుతున్న విద్యార్థులను, సహకరిస్తున్న తల్లిదండ్రులను కళాశాల కరస్పాండెంట్ పెరుమాళ్ల వెంకట్ రెడ్డి అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.

బుధవారం కళాశాల కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పెరుమాళ్ల వెంకట్ రెడ్డి మాట్లాడుతూ పదో తరగతిలో తక్కువ మార్కులు సాధించిన విద్యార్థులు కూడా చైతన్య కళాశాలలో చేరిన తర్వాత ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారని పేర్కొన్నారు. కళాశాలలో లాభాలను ఆశించకుండా విద్యార్థుల సర్వతో ముఖాభివృద్ధి ద్యేయంగా కళాశాలను నడిపిస్తున్నట్లు పేర్కొన్నారు. రోజువారి తరగతులతో పాటు కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కు ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తాండూరు పాఠశాలల్లో పదో తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులు రూ.లక్షలు పెట్టి హైదరాబాదుకు వెళ్లకుండా… తక్కువ ఫీజులతో చక్కగా విద్యా బోధన చేస్తున్న తాండూర్ పట్టణంలోని కళాశాలల్లోనే చదివితే తల్లిదండ్రులకు ఆర్థిక భారం తగ్గుతుందని పేర్కొన్నారు. హైదరాబాద్ కార్పొరేట్ కళాశాలలో చదివిన వారి కంటే స్థానిక కళాశాలలో చదువుతున్న విద్యార్థులకే ఎక్కువ మార్కులు వస్తున్నాయన్నారు. కార్పొరేట్ కళాశాలల్లో బోధించే సామర్ధ్యం గల అధ్యాపకులు మన దగ్గర ఉన్నారని… వారిని కూడా ప్రోత్సహించాల్సిన బాధ్యత విద్యార్థుల తల్లిదండ్రులకు ఉoదన్నారు. తల్లిదండ్రులు కూడా ఆలోచన చేసి స్థానికంగా అన్ని సౌకర్యాలు ఉన్న కళాశాలలో విద్యార్థులను చేర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ జగ్జీవన్ రెడ్డి, అధ్యాపకులు ఉన్నారు.

 

 

సన్మార్గదర్శి మహాత్మా బసవేశ్వరుడు..!