పర్సంటేజీ ఇస్తేనే బిల్లు పాస్ చేస్తా..!

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

పర్సంటేజీ ఇస్తేనే బిల్లు పాస్ చేస్తా..!
– తోటి ఉద్యోగి వద్ద లంచం డిమాండ్
– రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ఏసీబీ అధికారులు
– జిల్లా ఎక్సైజ్ ఆఫీస్‌ సీనియర్ అసిస్టెంట్ భాగోతం
వికారాబాద్‌, దర్శిని ప్రతినిధి : టీఏ బిల్లులో పర్సంటేజీ ఇస్తేనే పాస్‌ చేస్తానని తోటి ఉద్యోగి వద్దనే లంచం డిమాండ్ చేసిన ఎక్సైజ్ శాఖ సీనియర్ అసిస్టెంట్‌ను రంగారెడ్డి జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. శుక్రవారం వికారాబాద్‌ జిల్లా ఎక్సైజ్ సూపరిండెంట్‌ కార్యాలయంలో ఈ సంఘటన కలకలం రేపింది.

ఏసీబీ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా రేంజ్ అధికారి ఆనంద్ కుమార్ వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి. వికారాబాద్‌ జిల్లా సూపరిండెంట్‌ కార్యాలయంలో శ్రీధర్ సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. అదే కార్యాలయంలో పనిచేస్తున్న తోటి ఉద్యోగికి 2022-23సంవత్సరానికి గాను రావాల్సిన టీఏ బిల్లు సుమారు 76వేలు రావాల్సి ఉంది. ఈ బిల్లును పాస్‌ చేయాలంటే రావాల్సిన రూ. 76వేలలో పర్సంటేజీ కింద రూ. 8వేలను ఇస్తే బిల్లును పాస్ చేస్తానని శ్రీధర్ లంచం డిమాండ్ చేశారు. దీంతో తోటి ఉద్యోగి ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఫిర్యాదుతో ఏసీబీ అధికారులు శ్రీదర్‌ను ట్రాప్‌ చేసేందుకు పక్కా స్కెచ్ వేశారు. శుక్రవారం సాయంత్రం 4గంటల ప్రాంతంలో శ్రీధర్ రూ. 8వేలను తీసుకుంటుండగా రైడ్‌ చేశారు. డబ్బులు తీసుకున్న శ్రీధర్ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. శ్రీధర్ ను నగదుతో పాటు అదుపులోకి తీసుకున్నారు. ఈమేరకు శ్రీధర్‌పై కేసు నమోదు చేసి ఏసీబీ అధికారులు వెంటనే నాంపల్లి న్యాయస్థానం ముందు హాజరు పరచనునట్లు రంగారెడ్డి జిల్లా రేంజ్ అధికారి ఆనంద్ కుమార్ పేర్కొన్నారు.

ఇదికూడా చదవండి…

వక్ఫ్‌ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలి