వినాయకలో గుండె ఆపరేషన్ సక్సెస్

ఆరోగ్యం తాండూరు రాజకీయం వికారాబాద్

వినాయకలో గుండె ఆపరేషన్ సక్సెస్
– ఆసుపత్రిలో పూర్తి స్థాయి గుండె వైద్య సేవలు
– అభినందించిన ఆసుపత్రి చైర్మన్ విఠల్ నాయక్
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం శాంతినగర్ లోని వినాయక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో గుండె ఆపరేషన్ విజయవంతం అయ్యిందని ఆసుపత్రి వైద్యులు డా. మహమ్మద్ సల్మాన్ తెలిపారు. ఆసుపత్రిలో పూర్తి స్థాయిలో గుండె వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. పెద్దేముల్ మండలం తింసాన్ పల్లికి చెందిన సుక్కమ్మ అనే వృద్ధురాలు గుండె సమస్యలతో బాధపడుతోంది.

శనివారం ఆసుపత్రిలో చేరిన సుక్కమ్మకు గుండె వైద్య నిపుణులు డా. మహమ్మద్ సల్మాన్ పరిశీలించి గుండె సమస్యను గుర్తించారు. గుండెలోని రక్తనాళాలలో అడ్డంకులు ఏర్పడుతున్నాయని పరీక్షల ద్వారా గుర్తించారు. వెంటనే ఆమెకు ఆపరేషన్ చేసి గుండెలో స్టంట్ వేశారు. ఈ ఆపరేషన్ పూర్తిగా విజయవంతం అయ్యిందని తెలిపారు. ప్రస్తుతం సుక్కమ్మ ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు. మరోవైపు ఆసుపత్రి చైర్మన్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వర్త్యా విఠల్ నాయక్ ఈ విషయం తెలుసుకుని ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేసిన డా. మహమ్మద్ సల్మాన్ ను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి ఎండి చందులాల్, డైరెక్టర్ డా. రవీందర్ రాజా, వైద్యులు డా. సోహైల్, డా. రాజునాయక్, నర్సింగ్ ఇంచార్జ్ అజీజ, మార్కెటింగ్ మేనేజర్ సంతోష్ రాథోడ్, ఫార్మసి ఇంచార్జ్ మోతిలాల్, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

అనుమానాస్పద స్థితిలో కార్మికుడు మృతి