అనుమానాస్పద స్థితిలో కార్మికుడు మృతి
– కరణ్ కోట్ సీసీఐ ఫ్యాక్టరీలో వెలుగులోకి
– కర్మాగారం వద్ద కుటుంభీకుల ఆందోళన
– మృతిపై కరణ్ కోట్ పోలీసులకు ఫిర్యాదు
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : తాండూరు మండలం కరణ్ కోట్ సీసీఐ కర్మాగారంలో అనుమాస్పదస్థితిలో కాంట్రాక్ట్ కార్మికుడు మృతి చెందాడు. ఈ సంఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. కరణ్ కోట్ పోలీసులు, కుటుంభీకులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కరణ్ కోట్ గ్రామానికి చెందిన ఖాసీం అలీ, హుస్సేన్ అలీ(39) అన్నదమ్ములు. గత కొన్నేళ్లుగా ఈ అన్నదమ్ములు సీసీఐ ఫ్యాక్టరీలో కాంట్రాక్ట్ పద్దతిన కార్మికులుగా పనిచేస్తున్నారు.

ఖాసీం అలీ పేయింటర్ గా పనిచేస్తుండగా.. హుస్సేన్ అలీ ఫ్యాక్టరీలోని పంపుహౌస్ ఆపరేటర్ గా పనిచేస్తున్నారు. శుక్రవారం రాత్రి 10గంటల ప్రాంతంలో ఇద్దరు అన్నదమ్ములు ఫ్యాక్టరీలో నైట్ డ్యూటీకి హాజరయ్యారు. మద్యరాత్రిలో ఖాసీం అలీ తోటి కార్మికుడు హన్మంతుతో కలిసి తమ్ముడు పనిచేస్తున్న పంపుహౌస్ వద్దకు వెళ్లి చూడగా హుస్సేన్ అలీ అచేతన స్థితిలో కనిపించాడు. దగ్గరకు వెళ్లి లేపినా లేవలేదు. దీంతో వెంటనే చికిత్స నిమిత్తం తాండూరులోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు హుస్సేన్ అలీ అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో కుటుంబీకులు, కార్మిక సంఘం నాయకులు కర్మాగారం వద్ద కాసేపు ఆందోళనకు దిగారు. ఆరోగ్యంగా ఉండే హుస్సేన్ అలీ మరణించడం పట్ల పలు అనుమానాలు వ్యక్తం చేశారు. గుండె పోటుతో గాని, ఇతర కారణాల వల్ల మృతి చెంది ఉండవచ్చని, దీనిపై విచారణ చేపట్టాలని హుసేన్ అలీ అన్న ఖాసీం అలీ కరణ్ కోట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చె సుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ విఠల్ రెడ్డి తెలిపారు.

ఇదికూడా చదవండి…

