మ‌ద్య‌వ‌ర్తుల్లేకుండా ముటేష‌న్ సేవ‌లు..!

తాండూరు వికారాబాద్

మ‌ద్య‌వ‌ర్తుల్లేకుండా ముటేష‌న్ సేవ‌లు
– తాండూరు ఆర్డీఓ, ఇంచార్జ్ క‌మీష‌న‌ర్ అశోక్ కుమార్
– వార్డు వార్డులో కౌన్సిల‌ర్ల స‌మ‌క్షంలో ప‌త్రాల‌ను అంద‌జేత‌
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: తాండూరు మున్సిప‌ల్‌లో మ‌ద్య‌వ‌ర్తులు లేకుండా ప్ర‌జ‌ల‌కు ముటేష‌న్ సేవ‌ల‌ను అంద‌జేయ‌డం జ‌రుగుతుంద‌ని ఆర్డీఓ, ఇంచార్జ్ క‌మీష‌న‌ర్ అశోక్ కుమార్ పేర్కొన్నారు. బుధ‌వారం తాండూరు
ప‌ట్ట‌ణంలోని సాయిపూర్, గాంధీన‌గ‌ర్‌, పాత తాండూరు త‌దిత‌ర వార్డుల్లో తిరిగి పెండింగ్‌లో ఉన్న ముటేష‌న్ల‌ను ఇంటింటికి అందించే కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించారు. సాయిపూర్‌లో మున్సిప‌ల్ వైస్ చైర్ ప‌ర్స‌న్ ప‌ట్లోళ్ల దీపా న‌ర్సింలు, మాజీ వైస్ చైర్ ప‌ర్స‌న్ ప‌ట్లోళ్ల ర‌త్న‌మాల‌, గాంధీన‌గ‌ర్‌లో కౌన్సిల‌ర్ సంగీత ఠాకూర్, 34వ వార్డులో కౌన్సిల‌ర్ సోమ‌శేఖ‌ర్, 28వ వార్డులో కౌన్సిల‌ర్ విజ‌య‌దేవి, పాత తాండూరులో కౌన్సిల‌ర్ బొంబీనా త‌దిత‌రుల‌తో క‌లిసి అర్హులైన వారికి ముటేష‌న్ ప‌త్రాలు అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా ఆర్డీఓ, ఇంచార్జ్ క‌మీష‌న‌ర్ అశోక్ కుమార్ మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న ముటేష‌న్, అసెస్‌మెంట్‌ల‌ను ప‌రిష్క‌రించ‌డంలో భాగంగా ఇంటింటికి వెళ్లి అంద‌జేసే కార్య‌క్ర‌మం చేప‌ట్టం జ‌రిగింద‌న్నారు. అర్హులైన వారికి మ‌ద్య‌వ‌ర్తులు లేకుండా.. ముటేష‌న్ సేవ‌లు అందించ‌డ‌మే ముఖ్య ఉద్దేశ‌మ‌ని పేర్కొన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో ఆర్వో రాజ‌కుమారి, బిల్ క‌లెక్ట‌ర్లు త‌దిత‌రులు పాల్గొన్నారు.