వైభవంగా మృత్యుంజయ మహాయాగం

తాండూరు రాజకీయం వికారాబాద్

వైభవంగా మృత్యుంజయ మహాయాగం
– పైలెట్ నివాసంలో రుద్రాభిషేకం
– భజన సమాప్తి ముగింపులో పూజలు
– పాల్గొన్న ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి నివాసంలో నిర్వహించిన మృత్యుంజయ మహాయాగం వైభవంగా జరిగింది. గత 60 రోజులుగా ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి నివాసంలో భజన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సోమవారం భజన సమాప్తి సందర్భంగా నివాసంలో రుద్రాభిషేకం, మృత్యుంజయ మహాయాగంను నిర్వహించారు. వేద పండితుల ఆధ్వర్యంలో జరిగిన పూజల్లో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, తల్లి ప్రమోదిని రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పండితుల మంత్రోచ్చరణలతో పైలెట్ రోహిత్ రెడ్డి నివాసం మార్మోగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గతంలో తాండూరు ప్రజల సుభీక్షం కోసం రాజశ్యామల, అతిరుద్ర యాగాలు నిర్వహించడం జరిగిందన్నారు. హోమం, యాగాలతో అందరికి మంచి జరగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్, ఎమ్మెల్యే తండ్రి విఠల్‌ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..

పేద విద్యార్థుల సేవలో..!