స్థానిక గెలుపుపై గురి పెట్టాలి..!

తాండూరు రాజకీయం వికారాబాద్

స్థానిక గెలుపుపై గురి పెట్టాలి..!
– ఎన్నికలకు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండాలి
– బీఆర్ఎస్, బీజేపీ ప్రచారాలను నమ్మొద్దు
– కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు టి. రామ్మోహన్ రెడ్డి
– పార్టీ బలోపేతానికి కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలి
– తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి
– కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సంస్థాగత సమావేశం
తాండూరు, దర్శిని ప్రతినిధి : వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలలో గెలుపుపై గురి పెట్టి.. ఎన్నికలు ఎప్పుడొచ్చినా పార్టీ నేతలు, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షులు, పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్ రెడ్డి అన్నారు. పార్టీ బలో పేతానికి అందరు సైనికుల్లా పనిచేయాలని తాండూరు ఎమ్మెల్యే బనోహర్ రెడ్డి పిలుపునిచ్చారు.

మంగ ళవారం తాండూరు పట్టనం తులసీ గార్డెన్ లో కాంగ్రెస్ పార్టీ తాండూరు నియోజకవర్గ సంస్థాగత నిర్మాణ సన్నాహాక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షులు, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి. ఇంచార్జ్ వినోద్ కుమార్, నరేందర్, రాంశెట్టి, తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పేదల సంక్షేమం కోసం పనిచేస్తుందని అన్నారు. ప్రజా పాలనతో అందరి అభ్యున్నతికి పాటుపడుతోందని అన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ నేతలు, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలన్నారు. ఎన్నికల్లో పార్టీ గెలుపుకోసం అందరు బాధ్యతగా పనిచేయాలన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీపై బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న విష ప్రచారాన్ని తిప్పి కొట్టాలన్నారు. ప్రజా పాలన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలనని అన్నారు. ఇంచార్జ్ వినోద్ కుమార్ మాట్లాడుతూ పార్టీలో పనిచేసే నాయకులకు పదవులు వరిస్తాయన్నారు. అందరికి తగిన గుర్తింపు ఉంటుందన్నారు. తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ నేతలు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో ఉండడం గర్వకారణమన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సహాకారంతో పార్టీతో పాటు తాండూరు నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయడం జరుతుందన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీని గెలిపించుకునేందుకు అందరు సైనికుల్లా పనిచేయాలన్నారు.

భారత సైనికులకు నివాళులు
సమావేశంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు భారత సైనికులకు నివాళులు అర్పించారు. పహెల్గాం దాడికి ప్రతికారంగా భారత సైన్యం చేసిన ప్రతి దాడిలో సైనికులు అమరులు కావడం పట్ల రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక సంఘం సభ్యులు ఎం.రమేష్ మహారాజ్, ఆర్యవైశ్య కార్పరేషన్ చైర్ పర్సన్ కల్వ సుజాత, తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ధారాసింగ్, డీసీసీబీ జిల్లా వైస్ చైర్మన్ రవీందర్ గౌడ్, డీసీసీబీ మాజీ చైర్మన్ లక్ష్మారెడ్డి, నాయకులు డా. సంపత్ కుమార్, ఉత్తమ్ చంద్, అబ్దుల్ రవూఫ్, నారాయణ రెడ్డి, సర్దార్ ఖాన్, అజయ్ ప్రసాద్. యాలాల పీఏసీఎస్ చైర్మన్ సురేందర్ రెడ్డి, కాళికాదేవి దేవాలయ చైర్మన్ పి. బస్వరాజ్, వడ్డె శ్రీనివాస్, పార్టీ అధ్యక్షులు హబీబ్ లాల, జన్నె నాగప్ప, మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు, మాజీ కౌన్సిలర్లు పట్లోళ్ల నీరజాబాల్ రెడ్డి, ప్రభాకర్ గౌడ్, జుబేర్ లాల, మమత, బొంబీనా, యూత్ కాంగ్రెస్ నాయకులు కావలి సంతోష్ కుమార్, బంటు వేణుగోపాల్, మార్కెట్ కమిటి డైరెక్టర్లు, నియోజకవర్గంలోని వివిధ మండలాల ముఖ్య నాయకులు, నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

సర్కారు బడులపై నమ్మకం పెంచాలి