ప్రతి ఇంటికి ఉద్యోగమే మనోహరన్న లక్ష్యం..!
– జాబ్ మేళాలో యువతకు ఉద్యోగ అవకాశాలు
– తాండూరు నియోజకవర్గంలో 10వేల జాబ్‌లే టార్గెట్
– అవకాశాన్ని యువత అందిపుచ్చుకోవాలి
– భద్రేశ్వర రెనవేషన్ కమిటి చైర్మన్ పటేల్ కిరణ్ కుమార్
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవవర్గంలోని ప్రతి ఇంటికి ఉద్యోగం కల్పించాలన్న లక్ష్యంతో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ముందుకు సాగుతున్నారని తాండూరు భద్రేశ్వర దేవాలయ రెనవేషన్ కమిటి చైర్మన్ పటేల్ కిరణ్ కుమార్ అన్నారు. ఈనెల 29న తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలోని వినాయక కన్వెన్షన్ హాల్‌లో మెగా జాబ్ మేళా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

గురువారం ఉదయం 10 నుండి సాయంత్రం 5 గంటల వరకు జరిగే ఈ జాబ్ మేళా తెలంగాణ రాష్ట్రా నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎంప్లాయిమెంట్ జనరేషన్ అండ్ మార్కెటింగ్ మిషన్ ఆధ్వర్యంలో 50కి పైగా ప్రైవేట్ సంస్థలు పాల్గొంటున్నాయని తెలిపారు. ఈ జాబ్ మేళాతో తాండూరు నియోజకవర్గంలో దాదాపు 10 వేల ఖాళీల భర్తీకి ఈ సంస్థలు నోటిఫికేషన్ ఇచ్చాయి. పదో తరగతి నుంచి పీజీ వరకు అర్హులైన యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మార్కెటింగ్, ఐటీ, బ్యాంకింగ్, నర్సింగ్, ఫార్మసీ, రియల్ ఎస్టేట్ వంటి విభిన్న రంగాల్లో ఉద్యోగాలు అందుబాటులో ఉండగా, ఎంపిక కాలేకపోయిన వారికి 3 నెలల పాటు ఉచిత శిక్షణ, వసతి, భోజనం కలిపి మరింత నైపుణ్యం పెంపొందించే అవకాశాన్ని కూడా మనోహర్ రెడ్డి చొరవతో అందిస్తున్నారని తెలిపారు. కాగా గతంలో విజయవంతంగా నిర్వహించిన జాబ్ మేళా ద్వారా వేలాది మంది యువతకు ఉద్యోగాలు సమకూర్చారని గుర్తుచేశారు. తాండూరు నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతీ, యువకులు ఈ జాబ్ మెళాను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఇదికూడా చదవండి…

