ప్రాణ‌వాయువుకు క‌ష్టంలేకుండా..!

ఆరోగ్యం తాండూరు వికారాబాద్ హైదరాబాద్

ప్రాణ‌వాయువుకు క‌ష్టంలేకుండా..!
– ప్ర‌యోగాత్మ‌కంగా ద‌శ‌లో ఆక్సీజ‌న్ పాంట్లు
– జిల్లా ఆసుప‌త్రి, ఎంసీహెచ్‌లో త్వ‌ర‌లో అందుబాటులోకి
– ప్లాంట్ల‌ను ప‌రిశీలించిన ఏయిమ్స్ డైరెక్ట‌ర్ వికాస్ భాటియా
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: క‌రోనా క‌ష్ట‌కాలంలో ప్ర‌జ‌ల ప్రాణ‌వాయువుకు క‌ష్టంలేకుండా ఉండేందుకు కేంద్ర ప్ర‌భుత్వం ఆక్సీజ‌న్ ప్లాంట్ల‌ను ఏర్పాటు చేస్తుంద‌ని ఆల్ ఇండియా ఇన్సుట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్స్(ఏయిమ్స్) బీబీన‌గ‌ర్ ఎగ్జీక్యూటివ్ డైరెక్ట‌ర్ ఫ్రోఫెస‌ర్ వికాస్ భాటియా అన్నారు. గురువారం ఏయిమ్స్ సూప‌రిండెంట్ శ్యాంసుంద‌ర్‌తో క‌లిసి డైరెక్ట‌ర్ వికాస్ భాటియా తాండూరులోని జిల్లా ప్ర‌భుత్వ ఆసుప‌త్రి, మాతా శిశు సంర‌క్ష‌ణ ఆసుప‌త్రిని సంద‌ర్శించారు. జిల్లా ఆసుప‌త్రి సూప‌రిండెంట్ డాక్ట‌ర్ ర‌విశంక‌ర్‌తో క‌లిసి పీఎం కేర్ నిధుల నుంచి ఏర్పాటు చేస్తున్న పీఎస్ఏ ఆక్సీజ‌న్
సిలిండ‌ర్ల ఏర్పాటును ప‌రిశీలించారు. సిలిండ‌ర్ల కేంద్రాల నుంచి ఆసుప‌త్రిలోని వార్డుల‌కు ప్రాణ‌వాయువును అందించేందుకు ఎలాంటి చ‌ర్య‌లు తీసుకున్నారు.. అవి ఏద‌శ‌లో ఉన్నాయ‌ని స‌మీక్షించారు. జిల్లా ఆసుప‌త్రి, ఎంసీహెచ్‌లో ఆక్సీజ‌న్ ప్లాంట్ల ప‌నులు ప్ర‌యోగ‌ద‌శ‌లో ఉన్నాయ‌ని సూప‌రిండెంట్ డైరెక్ట‌ర్ వికాస్ భాటియా దృష్టికి తెచ్చారు. మొద‌టి, చివ‌రి మార్గాల‌లో కొన్ని లీకేజీలు ఉన్నాయ‌ని, ఇన్స్‌స్టాలేష‌న్‌లో టెక్నిక‌ల్ ఇబ్బందులు ఉన్నాయ‌ని వివ‌రించారు. అనంత‌రం ఏయిమ్స్ డైరెక్ట‌ర్ వికాస్ భాటియా విలేక‌రుల‌తో మాట్లాడుతూ క‌రోనా మొదటి, రెండో ద‌శ‌లో ఎంతో మంది బాధితులు ఊపిరి అంద‌క ప్రాణాలు కోల్పోయార‌ని గుర్తుచేశారు. ఎవ్వ‌రు కూడ ప్రాణ‌వాయువు అంద‌క ప్రాణాలు కోల్పోరాద‌ని కేంద్ర ప్ర‌భుత్వం పీఎం కేర్ ద్వారా అన్ని ఆసుప‌త్రుల‌లో ఆక్సీజ‌న్ ప్లాంట్ల‌ను ఏర్పాట్లు చేస్తుంద‌ని తెలిపారు. ఇందులో భాగంగా జిల్లా ఆసుప‌త్రి, ఎంసీహెచ్ ఆసుప‌త్రుల‌ను సంద‌ర్శించచ‌డం జ‌రింగింద‌న్నారు. ఇక్క‌డ కొన్ని స‌మ‌స్య‌ల‌ను గుర్తించామ‌ని, త్వ‌ర‌లోనే వాటిని ప‌రిష్క‌రించి ప్రాణ‌వాయువు అందించేందుకు కృషి చేయ‌డం జ‌రుగుతుంద‌ని స్ప‌ష్టం చేశారు.