ప్రజలు పరేషాన్ కావద్దని బియ్యం పంపిణీ
– కేంద్రం దూరదృష్టితో ఒకేసారి 3నెలల రేషన్
– బియ్యం పంపిణీని పరిశీలించిన బీజేపీ నేతలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : పేద ప్రజలకు పరేషాన్ కావద్దని కేంద్రం ఒకేసారి మూడు నెలల బియ్యం పంపిణీ చేస్తోందని బీజేపీ నేతలు అన్నారు. గరీబ్ కళ్యాణ్ యోజన కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో పేదలకు జూన్, జులై, ఆగస్టు నెలలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని పంపిణీ చేస్తోన్న సంగతి తెలిసిందే. మంగళవారం తాండూరు పట్టణంలో ఒకేసారి మూడు నెలల రేషన్ బియ్యం పంపిణీని బీజేపీ నేతలు పరిశీలించారు.

బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యు.రమేష్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణ ముదిరాజ్, కార్యదర్శి బంటారం భద్రేశ్వర్, పట్టణ అధ్యక్షులు నాగారం మల్లేశం తదిరులు రేషన్ దుకాణాలను సందర్శించారు. ప్రజలకు రేషన్ రేషన్ బియ్యం పంపిణీని పరిశీలించారు. రేషన్ కార్డుల దారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పంపిణీ చేయాలని రేషన్ డీలర్లను కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదల సంక్షేమానికి మోడి ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు. కరోనా, వర్షాకాలం విపత్తల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోడి దూర దృష్టితో పేదలకు ఒకేసారి మూడు నెలల రేషన్ బియ్యాన్ని పంపిణీ చేస్తోందన్నారు. ప్రజలు రేషన్ కోసం పరేషాన్ కావద్దని పంపిణీ చేస్తున్నారని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరు బియ్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు మల్లేశ్ యాదవ్, పట్టణ ఉపాధ్యక్షులు కందనెల్లి సంగమేశ్వర్, ప్రధాన కార్యదర్శి మిట్టి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

