అదరగొట్టిన హస్తం..!
– తాండూరులో జోరుగా బైకు ర్యాలీ
– ఉత్సహాంగా స్ట్రీట్ కార్నర్ మీటింగులు
– మత రాజకీయాల పార్టీలకు బుద్ది చెప్పండి
– ప్రచార ర్యాలీలో చేవేళ్ల ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి
– హస్తాన్ని గెలిపిస్తే ఐదేండ్లు సేవకులమవుతాం
– తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్రచార పర్వంలో హస్తం జోరు మొదలైంది. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో బైకు ర్యాలీ, స్ట్రీట్ కార్నర్ మీటింగులతో అదరగొట్టింది.. అందరిని ఆకర్షించింది. శుక్రవారం తాండూరు పట్టణంలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారం ఉత్సహంగా కొనసాగింది. చేవేళ్ల ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డితో పాటు పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి ర్యాలీ, స్ట్రీట్ కార్నర్ మీటింగ్లలో పాల్గొన్నారు. పట్టణంలోని విలి యమూన్ చౌరస్తా నుంచి ర్యాలీ కొనసాగింది. ర్యాలీలో ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిలు స్వయంగా బైకులు నడిపిస్తూ ముందుకు సాగారు.
కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నినాదాలు చేస్తూ నేతలు, కార్యకర్తలను ఉత్సహ పరిచారు. ర్యాలీతో పాటు సాయిపూర్ లో స్ట్రీట్ కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా రంజిత్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ మతం పేరుతో, గుడిల పేరుతో రాజకీయాలు చేస్తోందన్నారు. వాటి పేరు చెప్పి ఓట్లు అడిగే పార్టీలను నమ్మరాదన్నారు. బీజేపీ ప్రభుత్వంలో నిరుద్యోగం పెరిగిందని. పెద్దరికం పెరిగిందని విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి బుద్ది చెప్పాలన్నారు. అదేవిధంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేస్తున్నామన్నారు.

ఉచిత బస్సు ప్రయాణం. ఆరోగ్య శ్రీ పథకంలను రెండు రోజుల్లోనే అమలు చేసిన ఘనత సీఎం రేవంత్ రెడ్డిదే అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో రంజిత్ రెడ్డిని గెలిపించాలన్నారు. రంజిత్ రెడ్డి గెలిస్తే ఆయన తోడుతో ఐదేండ్లు తాండూరు అభివృద్ధికి రెట్టింపు ఉత్సహాంతో పనిచేస్తామని అన్నారు. అంతకుముందు సాయిపూర్ ప్రాంతం ఎమ్మెల్యేగా తన గెలుపులో కీలక పాత్ర పోషించిందని, ఇక్కడి ప్రజల సహాకారం మరువలేదని. వారికి అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు.
అనంతరం ర్యాలీ పట్టణంలోని పురవీధుల్లో ఉత్సహాంగా కొనసాగింది. ఈ కార్యక్రమంలో తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు బుయ్యని శ్రీనివాస్ రెడ్డి. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ధారాసింగ్, సాయిపూర్ బాల్ రెడ్డి, పట్లోళ్ల నర్సింలు, అబ్దుల్ రవూఫ్, మసూద్, కౌన్సిలర్లు ప్రభాకర్ గౌడ్, నీరజాబాల్ రెడ్డి, పార్టీ నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

