విద్యార్థులకు శాపంగా కాంగ్రెస్ సర్కారు

తాండూరు రాజకీయం వికారాబాద్

విద్యార్థులకు శాపంగా కాంగ్రెస్ సర్కారు
– బస్సు పాస్ చార్జీలు పెంచడం సిగ్గుచేటు
– బీఆర్ఎస్వీ పట్టణ అధ్యక్షులు సందీప్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : నిరుపేదల విద్యార్థుల పట్ల కాంగ్రెస్ సర్కారు శాపంగా మారిందని బీఆర్ఎస్వీ తాండూరు పట్టణ అధ్యక్షులు సందీప్ రెడ్డి విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ ద్వారా విద్యార్థుల బస్ పాస్ చార్జీలను పెంచడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

బుధవారం ఓ ప్రకటనలో మాట్లాడుతూ పాలన చేతకాగా ప్రభుత్వం ప్రజలపై ఆర్థిక భారం మోపుతుందని విమర్శించారు. చార్జీల పెంపు పేరుతో విద్యార్థులపై ఆర్థిక భారం మోపడం బాధాకరమన్నారు. విద్యార్థులకు రూ. 5లక్షల విద్యా భరోసా, ఫ్రీ ఇంటర్నెట్, ప్రతి మండలానికి అంతర్జాతీయ ప్రమాణాలతో పాఠశాల ఏర్పాటు, ఉచిత రవాణా సదుపాయం కల్పిస్తామని హామి ఇచ్చిన కాంగ్రెస్ సర్కారు ఇప్పుడు బస్ చార్జీలు పెంచడం సిగ్గుచేటన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల పట్ల శాపంగా మారిందని అన్నారు. పెంచిన చార్జీలను తగ్గించకపోతే బీఆర్ఎస్ పార్టీ, మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు.

ఇదికూడా చదవండి…

దత్తాత్రేయ స్వామి సేవలో శంకరన్న..!