కమలంకు మురళీకృష్ణ గుడ్ బై..!

తాండూరు రాజకీయం వికారాబాద్

కమలంకు మురళీకృష్ణ గుడ్ బై..!
– పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటన
– ఎందుకోసమో కారణాలు చెప్పిన నేత
– మాజీ ఎంపి కొండాపై వాఖ్యలు
తాండూరు, దర్శిని ప్రతినిధి: బిజెపి రాష్ట్ర నాయకులు, జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ మురళీకృష్ణ గౌడ్ కమలం పార్టీకి గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించారు. బిజెపిని వీడి కాంగ్రెస్ లో చేరుతున్నట్లు తెలిపారు. బిజెపిని వీడి కాంగ్రెస్ లో చేరేందుకు కారణాలను వెల్లడించారు. దీంతోపాటు చేవెళ్ల పార్లమెంట్ మాజీ సభ్యులు కొండ విశ్వేశ్వర్ రెడ్డి పై వ్యాఖ్యలు చేశారు. గురువారం తన గెస్ట్ హౌస్ లో మీడియాతో మాట్లాడారు. బిజెపి పార్టీతనకు పార్టీలో గౌరవం వచ్చిందని, దానికి అగ్ర నాయకులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అయితే ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి బిజెపిపై, అగ్ర నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేసినప్పటికీ చర్యలు తీసుకోకపోవడంతో పార్టీని వీడెందుకు నిర్ణయించుకున్నట్లు తెలిపారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో బిజెపిని దెబ్బతీసేందుకు కుట్రలు జరుగుతున్నాయి అన్నారు. ఈ నేపథ్యంలో సన్నితులతో, నేతలతో చర్చించి పార్టీకి దూరం కావాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. అదేవిధంగా గత ఎన్నికల్లో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి కోసం 18 ఏండ్ల పాటు పనిచేయడం జరిగిందని గుర్తు చేశారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత రోహిత్ రెడ్డి తనను దెబ్బతీసేందుకు కుట్రలు చేశారని ఆరోపించారు. తన వ్యాపారాలతో పాటు తనపై, తన ఇంటిపై దాడులు చేయించిన సంఘటనను గుర్తు చేశారు. అలాంటి వ్యక్తిపై బీజేపీ చర్యలు తీసుకోకపోవడం మరో కారణమన్నారు. మరోవైపు చేవెళ్ల మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి పై మురళీకృష్ణ గౌడ్వ్యాఖ్యలు చేశారు. ఆయన మంచి వ్యక్తి అని గుర్తు చేస్తూనే రాజకీయాలకు అయినా సరిపోరని విమర్శించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి, డిసిసిబి చైర్మన్ మనోహర్ రెడ్డి విజ్ఞప్తి మేరకు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు స్పష్టం చేశారు. త్వరలోనే కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకుని, తండ్రి చేతుల మీదుగా కాంగ్రెస్ కండువా వేసుకుంటానని తెలిపారు.

 

ఇది కూడా చదవండి..

 మోసపోవద్దు గొసపడతాం..