ట్యాపింగ్ టెన్షన్..!
– రాజకీయాల్లో హాట్ టాపిక్
– పెరుగుతున్న సిట్ కాల్ ఫిగర్
– ముగ్గురు కాదు.. ఐదు మందికి ఫోన్
తాండూరు, దర్శిని ప్రతినిధి : రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహరం టెన్షన్‌కు గురిచేస్తోంది. తాజాగా వికారాబాద్ జిల్లాకు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పాకడంతో తీవ్ర ఉత్కంఠతకు గురిచేస్తోంది. గత రాత్రి నుంచి తాండూరుకు చెందిన నేతలకు సిట్ నుంచి ఫోన్ కాల్ రావడంతో చర్చనీయాంశంగా మారింది.

మొదట కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ నాయకుడుతో పాటు ఓ ప్రభుత్వ టీచర్‌కు ఫోన్ కాల్ వచ్చిందంటూ హల్ చల్ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఫోన్ ట్యాపింగ్ సిట్ నుంచి వచ్చిన నేతల సంఖ్య పెరిగింది. ఇందులో కాంగ్రెస్ నాయకులు డా.సంపత్ కుమార్ తనకు ఫోన్ కాల్ వచ్చింది వాస్తవమే అని స్పష్టం చేశారు. మీడియా ముందు ఈ విషయాన్ని ప్రకటించారు. ఆయనతో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో సీనీయర్ నేత, ఆర్బీఓఎల్ సీఈఓ శ్రీనివాస్ రెడ్డికి కూడా ఫోన్ వచ్చినట్లు తెలిసింది.

అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న యువనాయకుడు వికాష్ జోషికి కూడ ఫోన్ వచ్చినట్లు మీడియా ప్రతినిధికి వెల్లడించారు. దీంతో పాటు తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అనుచరులలో ఇద్దరికి సిట్ నుంచి ఫోన్ కాల్ వచ్చినట్లు సమాచారం. మరోవైపు తాండూరు మండలంకు చెందిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు కూడా సిట్ నుంచి ఫోన్ వచ్చిన విషయాన్ని స్పష్టం చేశారు. నిజానికి ఈ సిట్ నుంచి వారందరికి నాలుగు రోజుల క్రితమే ఫోన్ కాల్ వచ్చినట్లు చెబుతున్నారు. సిట్ నుంచి ఫోన్ కాల్ అందుకున్న వారంతా సోమవారం, లేదా మంగళవారం జూబ్లిహిల్స్ లోని పోలీస్టేషన్‌లో విచారణకు హాజరువుతున్నట్లు వెల్లడించారు. అయితే సిట్ అధికారులు ట్యాపింగ్ వ్యవహారంలో తమకు ఉన్న సంబంధాలపై ఎలాంటి అనుమానాలను వ్యక్తం చేయలేదని చెప్పారు. నెంబర్లు ట్యాపింగ్‌కు గురికాబడ్డాయి. ఆ నెంబర్లు తమవేనా కాదా అనే విషయాన్ని కన్ఫాఫ్ చేసుకోవాడానికి హాజరు కావాలని సిట్ అధికారులు కోరినట్లు చెప్పారు.

ఇదికూడా చదవండి…

