శంకరన్న సేవాగుణం..!
– విద్యార్థులకు స్కూల్ బ్యాగుల పంపిణీ
– కొత్లాపూర్ పాఠశాల విద్యార్థులకు అందజేత
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : తాండూరుకు చెందిన ప్రముఖ రియల్ ఏస్టేట్ వ్యాపారి, శ్రీ సాయిపుత్ర హోమ్స్ అండ్ డెవలపర్స్ అధినేత భావనోళ్ల శంకర్ యాదవ్ తన సేవాగుణాన్ని చాటుకున్నారు.

మంగళవారం తాండూరు మండలం కొత్లాపూర్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు తన సొంత ఖర్చులతో స్కూల్ బ్యాగులు అందజేశారు. స్కూల్ లోని చిన్నారులందరికి శంకర్ యాదవ్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులందరు చక్కగా చదువుకోవాలని అన్నారు. చదువుతోనే ఉన్నత శిఖరాలకు ఎదగవచ్చని అన్నారు.

శ్రద్దగా చదువుకుని పాఠశాలకు, తల్లిదండ్రులకు, గ్రామానికి పేరు తీసుకరావాలని అన్నారు. అనంతరం పాఠశాల ఆధ్వర్యంలో విద్యార్థులు, టీచర్లు శంకర్ యాదవ్ ను సన్మానించారు. ఈ కార్యక్రమంలో శంకర్ యాదవ్ కుమారుడు అభినవ్ సాయి యాదవ్, పాఠశాల హెచ్ఎం జొన్నల వినోద్ కుమార్, ఏఏ పీసీ చైర్ పర్సన్ నాగమ్మ, వీఓఏ భాగ్యమ్మ, గ్రామ పంచాయతీ కార్యదర్శి సునీత, గ్రామ పెద్దలు కిరణ్, మల్లేష్, శ్రీనివాస్ రెడ్డి, టీచర్లు శారధా, శ్వేత, వజ్రమాల యువకులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

