పారిశుద్ధ్య సామాగ్రి స్కాంపై ఆర్టీఐ దరఖాస్తు
– దుబారాపై అధికార పార్టీ మౌనం విడ్డూరం
– మున్సిపల్ మాజీ కౌన్సిలర్ సంగీత ఠాకూర్
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్లో పారిశుద్ధ్య కార్మికుల కోసం కొనుగోలు చేసిన వస్తువులు, సామాగ్రి కొనుగోలు స్కాంలో నిజాలు తేల్చేందుకు పోరాటం చేయడం జరుగుతుందని మాజీ కౌన్సిలర్ సంగీత అజయ్ సింగ్ ఠాకూర్ అన్నారు.

శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులకు రూ.50లక్షలు వెచ్చించి వస్తువులు, నూనె, సామాగ్రి కొనుగోలు విషయంలో దుబారా జరిగిందని ప్రచారం జరుగుతుందని తెలిపారు. దీనిపై పూర్తి సమాచారం అందించాలని మున్సిపల్ అధికారులకు ఆర్టీఐ ద్వారా దరఖాస్తు చేయడం జరిగిందన్నారు. గత కౌన్సిల్ సమావేశంలో ఇదే వి షయంపై కార్మికులకు వస్తువులు కొనుగోలు చేసేందుకు రూ. 40లక్షలతో అంశాన్ని ప్రవేశ పెడితే.. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సమక్షంలో వ్యతిరేకించడం జరిగిందని గుర్తు చేశారు.

తాజాగా రూ.40లక్షలు కాకుండా రూ.10లక్షలు పెంచి రూ.50లక్షలతో కొనుగోలు చేయడం ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు. రూ.300ల చీరను రూ. 1800లు వెచ్చించినట్లు, గత సంవత్సరం మిగిలిన పాత సామాగ్రిని కలిపి నిధులు దుబారా చేసినట్లు ఆరోపణలు వచ్చాయని తెలిపారు. దీనిపై పూర్తి వివరాలు సేకరించేందుకు ఆర్టీఐ వేయడం జరిగిందని, కార్మికులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామన్నారు. ఈ అవినీతిపై అధికార పార్టీ నాయకులు స్పందించకపోవడం విడ్డూరమన్నారు. ఎమ్మెల్యే స్పందించి దుబారా ఖర్చు విషయంలో చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఇదికూడా చదవండి…

