స్మశాన వాటిక చింత తీర్చిన ఎమ్మెల్యే..!
– కృతజ్ఞతలు తెలిపిన సీతారాంపేట్ హనుమాన్ దేవాలయ చైర్మన్ భీమలింగం
– మనోహర్ రెడ్డి సహాకారంతో పాత తాండూరు స్మశాన వాటికలో బోరు ఏర్పాటు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సహాకారంతో సమస్యలు పరిష్కారం అవుతున్నాయని సీతారాంపేట్ హనుమాన్ దేవాలయ చైర్మన్ దొరశెట్టి భీమలింగం అన్నారు. ఆదివారం తాండూరు మున్సిపల్ పరిధి పాత తాండూరు స్మశాన వాటికలో బోరు మోటారు వేయించారు.

దేవాలయ చైర్మన్ భీమలింగం పార్టీ నాయకులతో కలిసి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాత తాండూరులోని స్మశాన వాటికలో బోరు వేయించాలని గతంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు.

అడిగిన వెంటనే ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి స్పందించి మున్సిపల్ కమీషనర్ కు ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. ఎమ్మెల్యే సహాకారంతో బోరు మోటారు వేయించడం జరిగిందన్నారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కృషితో సమస్యల పరిష్కారంతో పాటు అభివృద్ధి జరుగుతోందని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు హబీబ్ లాల, జైపాల్ రెడ్డి, పరమేశ్వర్, నర్సింలు, వెంకట్, నారాయణ తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

