రోష‌య్య సేవ‌లు మ‌రువ‌లేనివి..!

తాండూరు వికారాబాద్

రోష‌య్య సేవ‌లు మ‌రువ‌లేనివి..!
– మున్సిప‌ల్ చైర్ ప‌ర్స‌న్ స్వ‌ప్న ప‌రిమ‌ళ్
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోషయ్య సేవ‌లు మ‌రువ‌లేనివ‌ని తాండూరు మున్సిప‌ల్ చైర్ ప‌ర్స‌న్ తాటికొండ స్వ‌ప్న ప‌రిమ‌ళ్ గుప్త పేర్కొన్నారు. రోష‌య్య మ‌ర‌ణం ప‌ట్ల మంగ‌ళవారం తాండూరు ఆర్య వైశ్య సంఘం ఆధ్వ‌ర్యంలో నివాళులు అర్పించారు. ప‌ట్ట‌ణంలోని ఆర్య‌వైశ్య క‌ళ్యాణ మండపంలో నిర్వ‌హించిన కార్య‌క్ర‌మానికి చైర్ ప‌ర్స‌న్ స్వ‌ప్న ప‌రిమ‌ళ్ హాజ‌రై రోష‌య్య చిత్ర‌ప‌టానికి పూల‌మాల వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ పరిపాలనదక్షుడిగా, ఆర్థిక నిపుణుడిగా, ముఖ్యమంత్రిగా రోషయ్య ఎనలేని సేవలందించారని కొనియాడారు. మచ్చలేని నాయకుడుగా రోషయ్య మహనేతగా ప్రఖ్యాతిని పొందారని అన్నారు. నిస్వార్థంగా చేసిన ఆయన సేవలు మరువలేనివని, ఆయన స్పూర్తిని కొనసాగించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యాలాల ఎంపీపీ బాలేశ్వర్ గుప్త, కౌన్సిలర్ మంకాల రాఘవేందర్, ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు కోస్తి తిప్పయ్య, మల్లేపల్లి వెంకటేశం, ఆకారపు శివకుమార్, నారాయణ, కుంచెం మురళీధర్, కోట్రిక నాగరాజు, మహిళ అధ్యక్షురాలు, సంఘం ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.