ఆప్లై చేసిన 15రోజులకే..!

జాతీయం టెక్నాలజీ తెలంగాణ రాజకీయం హైదరాబాద్

ఆప్లై చేసిన 15రోజులకే..!
– ఇంటికి కొత్త ఓటరు కార్డు
– స్టేటస్‌ తెలుసుకునే అవకాశం కూడా
– కేంద్ర ఎన్నికల సంఘం తాజా నిర్ణయం
దర్శిని డెస్క్: కొత్త ఓటర్ల నమోదుపై కేంద్ర ఎన్నికల సంఘం కొత్త సంస్కరణలు తీసుకవస్తోంది. తాజాగా ఓటరు నమోదు చేసుకున్న వారికి కేవలం 15రోజుల్లోనే కొత్త కార్డును అందించేందుకు నిర్ణయం తీసుకుంది. అదికూడా నేరుగా ఇంటికే వచ్చేటట్లు చర్యలు చేపట్టింది. ఇందుకోసం ఎన్నికల సంఘం నూతన ప్రామాణిక నిర్వహణ విధానాన్ని(ఎస్ఓపీ)ని ప్రవేశ పెట్టింది. ఎన్నికల నమోదు అధికారి(ఈఆర్వో) ఎపిక్ జనరేట్ చేపట్టిన రోజు నుంచి పోస్టల్ విభాగం ద్వారా చేరేంత వరకు ఓటరు ఎస్ఎంఎస్ కూడా పంపిస్తోంది.

నమోదు చేయడం ఈజీ…
కొత్తగా ఓటరు నమోదు చేసుకునే వారు సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎన్వీఎస్‌పీ వెబ్ సైట్‌లోకి వెళ్లి ఫోన్ నెంబర్, ఈమేయిల్‌ ఐడీతో సైనప్‌ అవ్వాలి. క్రియేట్ చేసిన అకౌంట్‌పై క్లిక్ చేసి పేరు, పాస్‌వర్డ్ నమోదు చేయాలి. సైనప్‌ అయిన మేయిల్ ఐడీకి ఓటిపీ వస్తుంది. తర్వాత మోబైల్ నెంబర్, పాస్‌వర్డ్, క్యాప్చా ఎంటర్ చేయాలి. ఆ తరువాత కొత్తగా నమోదు చేసుకునే వారు ఫారం-6 ద్వారా వ్యక్తిగత వివరాలు, చిరునామ వివరాలను ఎంటర్ చేయాలి. సంబందించిన పత్రాలు అప్ లోడ్ చేయాలి. మరోసారి వివరాలను సరిచూసుకుని సబ్మిట్ చేయాలి. అంతే కొత్త ఓటర్ కార్డుకు దరఖాస్తు పూర్తయినట్లే. అదేవిధంగా ఇదివరకు కార్డును పొందిన వారు కూడా మార్పులు, చేర్పులు చేసుకునే అవకాశం ఉంది.

15రోజుల్లోనే ఇంటికి
గతంలో ఓటరు కార్డు నమోదు చేసుకుంటే చేతికి రావడానికి రోజులు పట్టేవి. ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయంతో 15 రోజుల్లోనే కార్డు నేరుగా ఇంటికే వస్తుంది. పోస్టల్ శాఖ ద్వారా కొత్త కార్డును ఇంటికే చేర్చే సదుపాయాన్ని తీసుకవచ్చింది. అదేవిధంగా ఆన్‌లైన్‌లో చేసుకున్న దరఖాస్తును ఎప్పటికప్పుడు ట్రాక్ చేసుకునే అవకాశం ఉంది. ఎన్‌వీఎస్‌పీ పోర్టల్‌లో మొబైల్ నెంబర్, ఫాస్‌వర్డ్, క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ అయిన తరువాత ట్రాక్‌ అప్లికేషన్‌పై క్లిక్ చేసి దరఖాస్తు చేసిన సమయంలో ఎస్ఎంఎస్ వచ్చిన రెఫ్సాన్స్‌ నమోదు చేయాలి. రాష్ట్రం ఎంపిక చేసుకుని సబ్మిట్ చేస్తే అప్టికేషన్ స్టేటస్‌ తెలుస్తుంది.

ఇదికూడా చదవండి…

స్మశాన వాటిక చింత తీర్చిన ఎమ్మెల్యే..!