రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు
– హాజరుకానున్న మంత్రి సబితారెడ్డి, ఎంపీ అభ్యర్థి కాసాని
– బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అప్పూ (నయూం)
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసినట్లు బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అప్పూ (నయూం) తెలిపారు. ముస్లిం సోదరుల పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ఎల్లుండి ఇఫ్తార్ విందు ఇస్తున్నారని తెలిపారు. ఎల్లుండి ఆదివారం పట్టణంలోని క్లాసిక్ గార్డెన్లో సాయంత్రం ఏర్పాటు చేసిన విందుకు రాష్ట్ర మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి, చేవేళ్ల ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ హాజరువుతున్నట్లు వెల్లడించారు. కావున ముస్లిం సోదరులు విందుకు హాజరుకావాలని విజ్ఞప్తి చేశారు.
ఇదికూడా చదవండి…

