సాయినాథుని సేవలో శంకరన్న..!
– గురుపౌర్ణమిలో ప్రత్యేక పూజలు
– షిర్డిసాయి మందిరంలో అన్నదానం
– పాల్గొన్న ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరుకు చెందిన ప్రముఖ రియల్ ఏస్టేట్ వ్యాపారి, శ్రీ సాయిపుత్ర హోమ్స్ అండ్ డెవలపర్స్ అధినేత భావనోళ్ల శంకర్ యాదవ్ సాయిబాబ సేవలో తరించారు.

గురువారం గురు పౌర్ణమిని పురస్కరించుకుని కోకట్ రోడ్డు మార్గంలో వెలసిన శ్రీ షిర్డీ సాయి బాబా మందిరంలో జరిగిన ఉత్సవాల్లో శంకర్ యాదవ్ సతీమణి చంద్రకళ, కుమారుడు అభినవ్ సాయి, కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కుటుంబ సమేతంగా సాయిబాబకు పుష్పాభిషేకం చేశారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. మరోవైపు ప్రతి యేడాది మాదిరిగానే దేవాలయంలో భక్తులకు అన్నదాన ప్రసాద వితరణ చేపట్టారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ నాయకులు, ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. ఆయనతో కలిసి శంకర్ యాదవ్ భక్తులకు అన్నదానం చేశారు.

ఉదయం 7 గంటల నుంచి అన్నదానం ప్రారంభమయ్యింది. మధ్యాహ్నం 3 గంటల వరకు అన్నదానం చేసేలా ఏర్పాట్లు చేశారు. శంకర్ యాదవ్ స్వయంగా భక్తులకు అన్నదానం చేశారు. సాయిబాబా భక్తులు పెద్ద సంఖ్యలో అన్నదానం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో శంకర్ యాదవ్ తల్లిదండ్రులు బావనోళ్ల హన్మయ్య, నీలమ్మతో పాటు బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్, జొన్నల వినోద్, జర్నలిస్ట్ వేణు గోపాల్ రెడ్డి, మనోహర్ యాదవ్, మున్సిపల్ మాజీ కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్, సాయిపూర్ బంటు మల్లప్ప, మధు సుధన్ రెడ్డి, శంకర్ యాదవ్ తనయుడు అభినయ్ సాయి, తులసి, వైష్ణవి, మాజీ ఎంపీపీ రాములు యాదవ్, శ్రీనివాస్, కమిటీ సభ్యులు సాయిలుగౌడ్, నర్సింహ, రవి, మల్ రెడ్డి, ఎల్లయ్య, రామ్ రెడ్డి, పూజారి సుమన్ పంతులు, కిషోర్ పంతులు తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

