సాయినాథ్‌ మహరాజ్‌కి జై..!

తాండూరు రాజకీయం వికారాబాద్

సాయినాథ్‌ మహరాజ్‌కి జై..!
– తాండూరులో ఘనంగా గురు పౌర్ణమి
– కోకట్ దేవాలయానికి పోటెత్తిన భక్తులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులోని సాయిబాబా దేవాలయాలలో గురుపౌర్ణమి సందడి నెలక్నొది. భక్తులు సాయినాథ్ మహరాజ్‌కీ జై అంటూ స్మరించుకున్నారు.

తాండూరు పట్టణం మల్‌ రెడ్డిపల్లి రోడ్డు మార్గంలో ఉన్న సాయిబాబా దేవాలయం, కోకట్ రోడ్డు మార్గంలో ఉన్న సాయిబాబా దేవాలయాలకు భక్తులు పోటేత్తారు. గురువారం తెల్లవారుజాము నుంచే సాయిబాబాను దర్శించుకునేందుకు భక్తులు క్యూకట్టారు. దీంతో ఆలయాలన్నీ భక్తులతో రద్దీగా మారిపోయాయి. వేకువజాము నుంచే భక్తులు పెద్ద ఎత్తున ఆలయాలకు చేరుకొని సాయిబాబాను దర్శించుకుంటున్నారు.

సాయినాథుడిని దర్శించుకొని తన్మయానికి గురయ్యారు. కోకట్ సాయిబాబా దేవాలయంలో భక్తులు సాయినాథునికి సామూహిక పుష్పాభిషేకం చేశారు. భక్తుల పుష్పాభిషేకంలో బాబా మునిగిపోయారు. అదేవిధంగా దేవాలయంలో ప్రత్యేక భజన కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. దేవాలయానికి వచ్చిన భక్తులకు కమిటి సభ్యులు ప్రసాద వితరణ చేశారు. భక్తుల రాకతో దేవాలయ ప్రాంగణం గురు పౌర్ణమి సందడి నిండుకుంది.

ఇదికూడా చదవండి…

కొత్త రేషన్ కార్డులు రెడీ..!