తాండూరు కాలేజీకి రాజయోగం..!
– మౌళిక సదుపాయాలకు నిధులు
– ప్రణాళికలు సిద్దం చేసిన అధికారులు
– మొదట రూ. 15లక్షల వినియోగం
– విద్యార్థులకు తీరనున్న కష్టాలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లాలోని తాండూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీకి రాజయోగం దక్కింది. ఇప్పటికే జిల్లాలో ఎక్కడా లేని విధంగా తాండూరు కాలేజీలో భారీగా అడ్మిషన్లు నమోదు అయ్యాయి. ఇదిలా ఉండగానే ప్రభుత్వం తాండూరు కాలేజీ అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేసింది.

ఈ మేరకు వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిధుల వినియోగంపై తాండూరు మండల అభివృద్ధి అధికారి(ఎంపీడీఓ) ద్వారా ప్రణాళికల వివరాలను నమోదు చేయించారు. ప్రభుత్వ కళాశాలలో విద్యార్థులకు త్రాగు నీరు, టాయిలెట్స్, లైట్స్, ఫ్యాన్లు ,పెయిటింగ్, ఇతర మౌళిక సదుపాకాలు కల్పించాలని ఆదేశించారు. ఈ సౌకర్యాల కోసం ప్రభుత్వం తాండూరు కాలేజీకి దాదాపు రూ. 40లక్షలకు పైగా నిధులు మంజూరు చేసింది.

ఇటీవలే జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు తాండూరు ఎంపీడీఓ విశ్వప్రసాద్ ప్రభుత్వ కాలేజీని సందర్శించారు. ఇక్కడి ప్రిన్సిపల్, అద్యాపకులతో పాటు విద్యార్థుల ద్వారా పలు వివరాలను సేకరించారు. కాలేజీలో టాయిలెట్లు, తాగునీరు, కిటీకీలు, తలుపులు మర్మత్తులతో పాటు ఇంకా కొన్ని అవసరమైన సౌకర్యాలపై నివేధికను జిల్లా కలెక్టర్‌కు పంపించారు. కాలేజీకి మంజూరైన రూ. 40లక్షలకు పైగా నిధుల్లో నుంచి మొదటి విడతగా రూ. 15లక్షలు వినియోగించాలని నిర్ణయించినట్లు సమాచారం. నివేధిక ఆధారంగా పనులపై ద్రుష్టి సారించి ఆగస్టు నెల చివరి నాటికి పూర్తి చేయాలని కసరత్తు చేస్తున్నారు. దీంతో కాలేజీలో చదివే విద్యార్థులకు మౌళిక సదుపాయాల ఇబ్బందులు తొలగిపోనున్నాయి.

ఇదికూడా చదవండి…

