
కాళికాదేవి బోనాల జాతర ఉత్సవాలకు రండి
– తాండూరు ఎమ్మెల్యేకు దేవాలయ కమిటి ఆహ్వానం
– ఈనెల 20 నుంచి జాతర ఉత్సవాలకు ఏర్పాట్లు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని కాళికాదేవి బోనాల జాతర ఉత్సవాలకు రావాలని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని దేవాలయ కమిటి సభ్యులు ఆహ్వానించారు. మంగళవారం ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని దేవాలయ చైర్మన్ పి. బస్వరాజ్, ఈఓ తాడెం నరేందర్, కమిటి సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈనెల 20, 21వ తేదిలలో కాళికాదేవి దేవాలయంలో ప్రతి యేడాది మాదిరిగానే ఆషాడం బోనాలు, జాతర ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ ఉత్సవాలకు తప్పక రావాలని ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు విజయ్ కుమార్ స్వామి, కమిటి సభ్యులు వెంకటేష్, శివకుమార్, నరహరి తదితరులు ఉన్నారు.

జాతర ఉత్సవాలకు ఏర్పాట్లు
జాతర ఉత్సవాలలో భాగంగా పకడ్బందీ ఏర్పాట్లు చేయడం జరిగిందని ఈఓ నరేందర్, చైర్మన్ పి.బస్వరాజ్ తెలిపారు. 20వ తేదిన సుప్రభాతం, ఘటస్థాపన, భజన మండలి ద్వారా కాగ్నాజలం తెచ్చుట, అమ్మవారికి అభిషేకం, గంగాపూజ జరుగుతాయని చెప్పారు. మధ్యాహ్నం నుంచి బోనాలు ఊరేగింపు, ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో అన్నదానం, సాయంత్రం రంగం ఎక్కుట, పోతురాజు ఆట, కథా కాలక్షేపం జరుగుతాయని వి వరించారు. 21వ తేదిన పూజా కార్యక్రమం, కుంకుమార్చన, లలిత సహస్రనామ పారాయణం, అన్నదానం, ఉత్సవ ఊరేగింపు కార్యక్రమాలు జరుగుతాయని చెప్పారు. కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కాలగలరని విజ్ఞప్తి చేశారు.

ఇదికూడా చదవండి…

