మనో రంజితం.. శివ మహాపురాణం..!
– అద్భుతంగా ప్రవచించిన మదన్ మోహన్ స్వామీజీ
– మంత్రముగ్ధులైన భక్తులు, శోభాయామానంగ స్వామి రథయాత్ర
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు రాజస్థాని మహిళ మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన శివ మహాపురాణం మనో రంజకంగా కొనసాగింది. శుక్రవారం రాజస్థాని మహిళ మండలి ఆధ్వర్యంలో రానున్న శ్రావణమాసంను పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

పట్టణంలోని గగ్రానీ గార్డెన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జైపూర్ నుంచి వచ్చిన ప్రముఖ పండితులు మదన్ మోహన్ స్వామిజీ హాజరై అద్భుతమైన ప్రవచనాలను వినిపించారు. అంతకుముందు మదన్ మోహన్ స్వామిజీని పట్టణంలోని బాలాజీ మందిర్ నుంచి గగ్రానీ గార్డెన్ వరకు రథంపై ఊరేగింపుగా తీసుకవచ్చారు. ఊరేగింపులో మహిళలు కళశాలతో భజన కీర్తనలు చేసుకుంటూ ముందుకు సాగారు. ఈ ఊరేగింపు శోభాయామానంగా కొనసాగింది.

అనంతరం శివ మహాపురాణాన్ని మదన్మోహన్ స్వామిజీ అద్భుతమైన ప్రవచనాలతో వినిపించారు. ఈ ప్రవచనాలకు మహిళలు, భక్తులు మంత్రముగ్దులయ్యారు. ఈ కార్యక్రమంలో మహిళ మండలి అధ్యక్షురాలు కిరణ్ మన్మోహన్ సార్డా, కార్యదర్శి వర్షా కైలాస్ సార్డా, కోశాధికారి కల్పన ఆనంద్ రాఠీ, కార్యక్రమ ఆర్థిక సహాయకులు, ముఖ్య నిర్వహకులు రాంబగస్ బంకట్ లాల్ సోని, మురళీధర్ గగ్రాని, రాజేష్ సోని కుటుంబ సభ్యులు, సమాజం పెద్దలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.


ఇదికూడా చదవండి…

